గాజా: ఇజ్రాయిల్ దాడుల నేపథ్యంలో పాలస్తీనా ప్రధాని( Palestinian Prime Minister) మొహమ్మద్ సయ్యే ఇవాళ రాజీనామా చేశారు. దేశాధ్యక్షుడు మహమ్మద్ అబ్బాస్‌కు తన రాజీనామాను సమర్పిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. గాజాతో పాటు వెస్ట్‌బ్యాంక్, జెరుసలాం ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తలు నెలకొన్న నేపథ్యంలో తాను రాజీనామా చేస్తున్నట్లు ఆయన చెప్పారు. హమాస్ అటాక్ నేపథ్యంలో.. ఇజ్రాయిల్ దళాలు పాలస్తీనాపై యుద్ధం ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే పాలస్తీనా రాజకీయ ఏకాభిప్రాయం కుదిరేందుకు తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రధాని సయ్యే తెలిపారు. ఇజ్రాయిల్, హమాస్ వార్ నేపథ్యంలో పాలస్తీనాపై అమెరికా తీవ్ర వత్తిడి తెచ్చింది. రాజకీయంగా సమస్యను పరిష్కరించుకోవాలని అమెరికా కూడా సూచిస్తోంది.