Pakistan Astronaut: చైనా స్పేస్స్టేషన్కు వెళ్లనున్న పాకిస్థానీ ఆస్ట్రోనాట్
Pakistan Astronaut: చైనా అంతరిక్ష కేంద్రానికి పాకిస్థానీ వ్యోమగామి(Pakistan Astronaut) వెళ్లనున్నారు. షెంజూ-24 వ్యోమనౌకలో ఆ ఆస్ట్రోనాట్ ప్రయాణిస్తారు. చైనీస్ స్పేస్ స్టేషన్‌కు వెళ్తున్న తొలి విదేశీ వ్యక్తిగా పాక్ ఆస్ట్రోనాట్ రికార్డు క్రియేట్ చేయనున్నారు.
బీజింగ్: చైనా అంతరిక్ష కేంద్రానికి పాకిస్థానీ వ్యోమగామి(Pakistan Astronaut) వెళ్లనున్నారు. షెంజూ-24 వ్యోమనౌకలో ఆ ఆస్ట్రోనాట్ ప్రయాణిస్తారు. చైనీస్ స్పేస్ స్టేషన్‌కు వెళ్తున్న తొలి విదేశీ వ్యక్తిగా పాక్ ఆస్ట్రోనాట్ రికార్డు క్రియేట్ చేయనున్నారు. అంతరిక్ష కేంద్రంలో స్వల్ప వ్యవధి పాటు ఆ ఆస్ట్రోనాట్ గడపనున్నారు. షెంజూ-24 మిషన్‌కు చెందిన వివరాలను చైనా అంతరిక్ష సంస్థ వెల్లడించింది. అయితే వ్యోమనౌక ప్రయోగ తేదీని కానీ, లేక పాక్ వ్యోమగామి ఎవరన్నదానిపై చైనా ప్రకటన చేయలేదు. చైనా అంతరిక్ష చరిత్రలో తొలిసారి రెండు దేశాలు సంయుక్తంగా మిషన్ చేపట్టనున్నాయి. పాకిస్థానీ ఆస్ట్రోనాట్.. ఓ పేలోడ్ స్పెషలిస్టు తరహాలో ఆ జర్నీలో ఉంటారని చైనా మీడియా పేర్కొన్నది. ప్రస్తుతం చైనాలో ఇద్దరు పాకిస్థానీ వ్యక్తులు వ్యోమగాములుగా శిక్షణ పొందుతున్నారు. మొహమ్మద్ జీషాన్ అలీ, ఖుర్రం దౌడ్.. చైనీస్ వ్యోమగాములతో శిక్షణ తీసుకుంటున్నారు. ఈ ఇద్దరిలో ఒకరు చైనా అంతరిక్ష కేంద్రానికి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. 2025 ఫిబ్రవరిలో కుదిరిన అగ్రిమెంట్ ఆధారంగా ఈ మిషన్ చేపట్టనున్నారు.
పాకిస్థాన్ కూడా ఇటీవల తన స్పేస్ ప్రోగ్రామ్ గురించి వెల్లడించింది. 2035 నాటికి చంద్రుడిపైకి వెళ్తామని మంత్రి అషాన్ ఇక్బాల్ తెలిపారు. పాకిస్థాన్ నిర్మిత లూనార్ రోవర్‌ను చైనాకు చెందిన ఛేంజ్-8 మిషన్ ద్వారా పంపనున్నారు. 2028లో ఈ ప్రయోగం జరిగే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు చైనా మాత్రం 2030 నాటికి చంద్రుడిపై వ్యోమగాములను దింపేందుకు ప్రయత్నిస్తోంది. ఇక 2035 నాటికి భారత్ తన స్వంత స్పేస్ స్టేషన్ నిర్మించే ప్రయత్నాలు కొనసాగిస్తోంది. చంద్రుడిపైకి 2040 నాటికి ఆస్ట్రోనాట్‌ను పంపేందుకు చూస్తోంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan Astronaut: చైనా స్పేస్స్టేషన్కు వెళ్లనున్న పాకిస్థానీ ఆస్ట్రోనాట్
Actress Surekha Vani | నటి సురేఖ వాణి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్.. ప్రైవేట్ వీడియోలు వైరల్ కావడంతో తీవ్ర ఆగ్రహం!
Adilabad RIMS | ఆదిలాబాద్ రిమ్స్‌లో వెంటిలేటర్ల చోరీ.. దొంగల ముఠా అరెస్ట్!
Sandra Venkata Veeraiah | హెలికాప్టర్ ఖర్చులు తగ్గించి రైతులకు పరిహారం ఇవ్వాలి: సండ్ర డిమాండ్
Vaddiraju Ravichandra | కరువు వేళ మంత్రులకు హెలికాప్టర్ పర్యటనలా?.. రైతుల కష్టాలు పట్టించుకోరా: వద్దిరాజు ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

