Shahbaz Sharif | తోషాఖానా బహుమతులను వేలం వేయనున్న పాక్.. ప్రకటించిన ప్రధాని షెహబాజ్
Shahbaz Sharif | పాకిస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ తోషాఖానాలోని బహుమతులను (Toshakhana Gifts) వేలం వేయాలని నిర్ణయించింది.
Shahbaz Sharif | పాకిస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ తోషాఖానాలోని బహుమతులను (Toshakhana Gifts) వేలం వేయాలని నిర్ణయించింది. ఈ మేరకు పాక్ ప్రధాని (Pakistan PM) షెహబాజ్ షరీఫ్ (Shahbaz Sharif ) ప్రకటించారు. తోషాఖానా కానుకల ద్వారా వచ్చిన డబ్బును పేదలు, నిస్సహాయకుల కోసం వినియోగిస్తామని వెల్లడించారు.
పాక్ మీడియా నివేదిక ప్రకారం.. ‘తోషాఖానాలోని మిలియన్ల విలువైన బహుమతులను వేలం వేయాలని నిర్ణయించాను. ఈ వేలం ద్వారా వచ్చిన డబ్బును అనాథ పిల్లల సంక్షేమ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యా సంస్థలు, వైద్య సదుపాయాల కోసం వినియోగిస్తాం. వాటికి తప్ప ఆ నిధులు మరెక్కడికీ వెళ్లవు’ అని
షెహబాజ్ వెల్లడించారు. మరోవైపు తోషాఖానా బహుమతులను అక్రమంగా విక్రయించిన కేసులోనే మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) జైలు పాలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆ బహుమతులను వేలం వేయాలని షెహబాజ్ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
నేడు పాక్ జాతీయ అసెంబ్లీ రద్దుకు సిఫార్సు..
మరోవైపు ఐదేళ్ల పాలన గడువు ముగిసేలోపే పాక్ పార్లమెంట్ ను రద్దు (Dissolve Parliament) చేయనున్నట్లు షెహబాజ్ ప్రకటించిన విషయం తెలిసిందే. పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ ప్రస్తుత పదవీకాలం ముగియడానికి మూడు రోజుల ముందే దాన్ని రద్దు చేసి ఎన్నికలు జరిపించాలని ఈనెల 9న (నేడే) సిఫార్సు చేస్తానని షెహజాబ్ ఇటీవలే వెల్లడించారు. ఈ నేపథ్యంలో నేడు పాక్ పీఎం పదవికి షెహబాజ్ రాజీనామా చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుతం పాక్ లో పాకిస్థాన్ ముస్లిం లీగ్ – నవాజ్ (Pakistan Muslim League-Nawaz), పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (Pakistan Peoples Party) కూటమి అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుత ప్రభుత్వ ఐదేళ్ల రాజ్యాంగ పదవీకాలం ఆగస్టు 12న అర్ధరాత్రితో ముగియనుంది. పాక్ రాజ్యాంగం ప్రకారం.. అసెంబ్లీని రద్దు చేస్తే 60 రోజుల్లోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఒకవేళ 5 ఏళ్ల నిర్ణీత గడువుకు ముందే ప్రభుత్వం కూలిపోతే, లేక పార్లమెంట్ ముందే రద్దయితే పాకిస్థాన్ ఎన్నికల సంఘం 90 రోజుల్లోగా సాధారణ ఎన్నికలను నిర్వహిస్తుంది. దీంతో నిర్ణీత కాలానికి ముందే రద్దు చేయడం తమకు కలిసొస్తుందని పీఎంఎల్-ఎన్ నేతృత్వంలోని పాకిస్థాన్ డెమోక్రటిక్ మూవ్మెంట్ కూటమి భావిస్తోంది. ఇందులో భాగంగానే బుధవారం నేషనల్ అసెంబ్లీ రద్దుకు సంబంధించిన నోటిఫికేషన్ ను అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీకి.. ప్రధాని షరీఫ్ పంపనున్నట్లు ది ఎక్స్ ప్రెస్ ట్రిబ్యూన్ వార్తాపత్రిక నివేదించింది.
Also Read..
Mukesh Ambani | లగ్జరీ ఇంటిని అమ్మేసిన ముకేశ్ అంబానీ..! ఎన్ని కోట్లకంటే..?
Mahesh Birthday | మహేష్ కు మంత్రి కేటీఆర్ స్పెషల్ విషెస్
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

