పీవోకే ఎన్నికల్లో రిగ్గింగ్.. పాక్ ఆర్మీకి వ్యతిరేకంగా నిరసనలు

కోట్లి: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా రిగ్గింగ్ జరిగిందని ఆ ప్రాంత ప్రజలు ఆరోపించారు. భారీగా పాక్ ఆర్మీని మోహరించడంపై పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఈ నెల 25న జరిగిన ఎన్నికల్లో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన పాకిస్థాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (పీటీఐ) 25 స్థానాల్లో, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) 11, పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పిఎంఎల్-ఎన్) 6 స్థానాల్లో గెలిచాయి. పీవోకే అసెంబ్లీలోని మొత్తం 53 మంది సభ్యులకు 45 మందిని ఎన్నికల ద్వారా నేరుగా ఎన్నుకుంటారు.
కాగా పీవోకే ప్రజల కంటితుడుపు కోసం ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఈ ఎన్నికలను ప్రహసంగా మార్చారని ప్రతిపక్ష పార్టీలు మండిపడ్డాయి. అధికార పార్టీ రిగ్గింగ్‌కు పాల్పడిందని పీపీపీ చైర్పర్సన్ బిలావాల్ భుట్టో జర్దారీ ఆరోపించారు. ఎన్నికల ఫలితాలను తాము అంగీకరించడం లేదన్నారు.
మరోవైపు పీవోకేలోని గిల్గిట్-బాల్టిస్థాన్‌లో ఎన్నికలను పాకిస్థాన్ నిర్వహించడాన్ని భారత్ ఖండించింది. సైనిక ఆక్రమిత ప్రాంతం స్థితిని మార్చేందుకు చేసిన ఈ చర్యకు ఎటువంటి చట్టపరమైన ఆధారం, విలువ లేదని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

