India-Pak | భారత్‌తో సంబంధాలకు పాక్ తహతహ.. కీలక వ్యాఖ్యలు చేసిన విదేశాంగ మంత్రి ఇషాక్..!
India-Pak | యాదాది దేశం ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులు అల్లాడుతున్నది. ప్రస్తుతం భారత్‌తో సంబంధాలను పునరుద్ధరించాలని ఆ దేశానికి చెందిన వ్యాపారవేత్తలను ప్రభుత్వానికి సూచించారు. ఈ క్రమంలో ఆ దేశం క్రమంగా భారత్‌పై తన వైఖరిని మార్చుకుంటూ వస్తున్నట్లుగా కనిపిస్తున్నది.
India-Pak | యాదాది దేశం ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులు అల్లాడుతున్నది. ప్రస్తుతం భారత్‌తో సంబంధాలను పునరుద్ధరించాలని ఆ దేశానికి చెందిన వ్యాపారవేత్తలను ప్రభుత్వానికి సూచించారు. ఈ క్రమంలో ఆ దేశం క్రమంగా భారత్‌పై తన వైఖరిని మార్చుకుంటూ వస్తున్నట్లుగా కనిపిస్తున్నది. గతంలో భారత్ అంటేనే కుతకుతలాడే ఆ దేశం.. ప్రస్తుతం సత్సంబంధాలకు రెడీ అంటూ సంకేతాలను ఇస్తున్నది. భారత్‌తో తాము శాశ్వత శత్రుత్వాన్ని కోరుకోవడం లేదని.. కొత్త ప్రభుత్వం ఈ విషయంలో సానుకూలంగా వ్యవహరిస్తుందని ఆ దేశ డిప్యూటీ ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇస్లామాబాద్‌తో సంబంధాల పునరుద్ధరణ విషయంలో భారత్ హుందాగా వ్యవహరిస్తుందని భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్ట్రాటజిక్ స్టడీస్ ఇస్లామాబాద్ (ISIS) సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పొరుగుదేశాలతో తాము మంచి సంబంధాలను కోరుకుంటామన్నారు. తూర్పున ఉన్న భారత్‌తో సంబంధాలు చారిత్రక సమస్యగా మారాయని.. అయితే, పాక్ శాశ్వత శత్రుత్వాన్ని ఎన్నడూ విశ్వసించదన్నారు. పరస్పర గౌరవం, సార్వభౌమ సమానత్వం, జమ్మూకశ్మీర్‌పై దీర్ఘకాలంగా ఉన్న వివాదానికి న్యాయమైన, శాంతియుత పరిష్కారం ఆధారంగా భారత్‌తో మంచి సంబంధాలు కోరుకుంటున్నామన్నారు. నిర్మాణాత్మక చర్చలను పాకిస్థాన్ కోరుకుంటోందని, అంతమాత్రాన ఏకపక్ష, భారత్ ఆధిపత్య విధానాలను మాత్రం పాక్ అంగీకరించబోదన్నారు.
Read Also :
- Encounter | జమ్మూలో ఎన్కౌంటర్.. ఆపరేషన్ ‘లగోర్’లో ముగ్గురు ఉగ్రవాదులు హతం..!
- Mysterious Deaths | కరాచీలో మిస్టీరియస్ డెత్స్.. 22 మంది మృతితో హై అలెర్ట్
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

