Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
Pakistan Army: పాకిస్థాన్‌లో ఇద్దరు ఆర్మీ పైలట్లు మృతిచెందారు. శిక్షణ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో అది కూలింది. బలోచిస్తాన్ రాజధాని క్వెట్టా ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు పాక్ ఆర్మీ చెప్పింది.
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో ఇద్దరు ఆర్మీ(Pakistan Army) పైలట్లు మృతిచెందారు. శిక్షణ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో అదికూలింది. బలోచిస్తాన్ రాజధాని క్వెట్టా ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు పాక్ ఆర్మీ చెప్పింది. పాకిస్థాన్ ఆర్మీ ఏవియేషన్‌కు చెందిన ముషాక్ శిక్షణ విమానం కూలినట్లు అధికారులు చెప్పారు. పైలట్లు మేజర్ హుస్నైన్ షెహజాద్ హుమయున్, ఇన్స్ట్రక్టర్ కెప్టెన్ అబ్దుల్ సమద్ ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. దేశాధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారి, ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఈ ఘటన పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపారు. జూన్ నెలలో పాకిస్థాన్ ఆర్మీ ఏవియేషన్‌కు చెందిన ఎంఐ-17 హెలికాప్టర్ .. ముజాఫరాబాద్‌లో కూలిన ఘటనలో సిబ్బంది మొత్తం మృతిచెందిన విషయం తెలిసిందే.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
Singareni Simha Garjana | సింగరేణి సింహా గర్జనను విజయవంతం చేయాలి : టీబీజీకేఎస్ పిలుపు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

