పాక్‌లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో తన పంతాన్ని నెగ్గించుకోవడానికి ప్రధాని ఇమ్రాన్ సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేయాలని భావిస్తున్నారని తెలుస్తోంది. పాక్‌లో ఆయన ఎమర్జెన్సీ విధించడానికి తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారన్న వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం మాత్రం అందడం లేదు. ప్రధాని ఇమ్రాన్ బుధవారం జాతినుద్దేశించి ప్రసంగిస్తారని వార్తలొచ్చాయి. అయితే పాక్ ఆర్మీ చీఫ్ బాజ్వా ఆయనతో భేటీ అయిన తర్వాత జాతినుద్దేశించి ప్రసంగించే విషయాన్ని రద్దు చేసుకున్నారు. ఒకవేళ… జాతినుద్దేశించి ప్రసంగిస్తే మాత్రం ఇమ్రాన్ కచ్చితంగా ఈ ఎమర్జెన్సీ నిర్ణయాన్ని ప్రస్తావించే వారని పాక్ వర్గాలు పేర్కొంటున్నాయి.
మరోవైపు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కేబినెట్ స్పెషల్ మీటింగ్‌ను నిర్వహిస్తున్నారు. ఇమ్రాన్ బుధవారం రాజీనామా చేస్తారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ స్పెషల్ కేబినెట్ మీట్‌కి చాలా ప్రాధాన్యం ఏర్పడింది. మరో వైపు ఆర్మీ చీఫ్ బాజ్వాతో భేటీ అయిన తర్వాత ఆయన జాతీయ భద్రతా కౌన్సిల్ సమావేశాన్ని కూడా నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితులను చర్చించినట్లు తెలుస్తోంది.