పీటీవీకి చెందిన 17 మంది సిబ్బందిని యాజమాన్యం తొలగించింది. ఎందుకంటే పాక్ ప్రధాని షాహబాజ్ ప్రసంగాన్ని లైవ్ టెలికాస్ట్ చేయలేదని, 17 మందిని తొలగించింది యాజమాన్యం. ప్రధాని షాహబాజ్ లాహోర్ పర్యటనలో ఉన్నారు. అయితే ప్రధాని ప్రసంగాన్ని కవర్ చేయడానికి తమ వద్ద అధునాతన ల్యాప్ ట్యాప్ లేదని, అందుకే కవర్ చేయలేకపోయామని ఉద్యోగులు పేర్కొంటున్నారు.
పాక్ మీడియా ప్రకారం.. .గత వారం ప్రధాని షాహబాజ్ లాహోర్ పర్యటనలో వున్నారు. ఈ సందర్భంగా ఆయన లఖ్‌పత్ జైల్, రమ్జాన్ బజార్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు కూడా ఆయనతోనే వున్నారు. అయినా.. అధునాతన ల్యాప్ ట్యాప్ లేకపోవడం వల్ల వాళ్లు కవర్ చేయలేదు.
అయితే ప్రధాని లాహోర్ పర్యటన గురించి పీటీవీకి ముందస్తు సమాచారం అందిందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రధానితో ఓ వీవీఐపీ టీమ్ వుంటుందని, అధునాతన సాంకేతికతతో వున్న ల్యాప్‌ట్యాప్ కూడా వుంటుందని, దీనిని సరైన సమయంలో అప్లోడ్ చేసే వ్యవస్థ కూడా వుంటుందని అంటున్నాయి.