డెన్వర్: ప్రమాదకర రేడియేషన్ నుంచి భూమికి రక్షణ కల్పించే ఓజోన్ పొరకు ఏర్పడిన రంధ్రం మెల్లగా పూడ్చుకుంటున్నదని ఐక్యరాజ్యసమితి నివేదిక పేర్కొంది. ఓజోన్ను పరిరక్షించేందుకు ప్రయత్నాలు ప్రారంభమైన 35 ఏండ్ల తర్వాత ఎట్టకేలకు ఓజోన్ పొర రంధ్రం పూడుకుంటుందని గుర్తించారు.
అయితే, పూర్తిగా పూడుకోవాలంటే మాత్రం 2066 వరకు సమయం పడుతుందని నివేదిక వెల్లడించింది. చర్మ క్యాన్సర్, కంటి సమస్యలు, పంట నష్టాలకు కారణమయ్యే రేడియేషన్ నుంచి ఓజోన్ పొర రక్షణ కల్పిస్తుంది.