Israel-Hamas War | ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం.. గాజాలో ఉద్యోగాలు కోల్పోయిన 60 శాతం మంది: ఐఎల్ఓ
ILO | ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం వల్ల గాజాలో ఇప్పటివరకు 60 శాతం మంది ఉద్యోగాలు కోల్పోయారని ఐక్యరాజ్య సమితికి చెందిన అంతర్జాతీయ కార్మిక సంస్థ (ILO) తెలిపింది.
ILO | ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం (Israel-Hamas War) కారణంగా పాలస్తీనాలోని గాజాలో పరిస్థితులు పరిస్థితులు దారుణంగా మారాయి. గాజా స్ట్రిప్‌ని (Gaza Strip) ఇజ్రాయెల్ అన్నివైపుల నుంచి దిగ్భందించడంతో తిండి, తాగడానికి గుక్కెడు నీళ్లు దొరకక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బాంబుల మోతతో బతుకు జీవుడా అంటూ కట్టుబట్టలతో వలసబాటపట్టారు. ఇజ్రాయెల్ (Israel) వైమానిక దాడులు గాజా పౌరుల ఉద్యోగాలపై (Jobs) తీవ్ర ప్రభావం చూపాయి.
యుద్ధం వల్ల నగరంలో ఇప్పటివరకు 60 శాతానికిపైగా మంది ఉద్యోగాలు కోల్పోయారని ఐక్యరాజ్య సమితికి చెందిన అంతర్జాతీయ కార్మిక సంస్థ (ILO) తెలిపింది. గత నెల 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి చేసిన విషయం తెలిసిందే. దానికి ప్రతిగా గాజాపై ఆ దేశం దాడులు ప్రారంభించడంతో పాలస్తీనా భూభాగంలో మొత్తం లక్షా 82 వేల మంది ఉద్యోగాలు కోల్పోయారని ఐఎల్ఓ తాజాగా విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. జీవనోపాధి కోల్పోవడంతో దాదాపు సగంమంది పేదరికంలో దుర్భర జీవితం గడుపుతున్నారని వెల్లడించింది.

యుద్ధం వల్ల పాలస్తీనా లేబర్ మార్కెట్ ఆర్థిక సంక్షోభంలో పడిందని, మరికొంత కాలం ఇలాగే కొనసాగితే పరిస్థితులు మరింత తీవ్రతరమవుతాయని ఐఎల్ఓ అరబ్ రాష్ట్రాల ప్రాంతీయ డైరెక్టర్ రుబా జరాదత్ (Ruba Jaradat) చెప్పారు. ఈ సంక్షోభం వల్ల గాజాలో ఇదే పరిస్థితి కొన్నేండ్లపాటు ప్రతిధ్వనిస్తుందన్నారు. ఇజ్రాయెల్ ఆంక్షల వల్ల యుద్ధానికి ముందుకూడా గాజాలోని 23 లక్షల మందికిపైగా పేదరిక రేఖకు దిగువనే ఉండేవారని వెల్లడించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Gaza strip
- Hamas
- ILO
- Israel
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

