Afghanistan | వరుస భూకంపాలతో గజగజ వణికిన అప్గానిస్థాన్.. 2000 పెరిగిన మృతుల సంఖ్య
Afghanistan | అఫ్గానిస్థాన్ వరుస భూకంపాల్లో మృతుల సంఖ్య గణనీయంగా పెరిగింది. భూకంప ధాటికి ఇప్పటివరకు రెండు వేల మందికి పైగా మరణించారు. 400 మందికి పైగా గాయపడ్డారు.
Afghanistan | అఫ్గానిస్థాన్ వరుస భూకంపాల్లో మృతుల సంఖ్య గణనీయంగా పెరిగింది. భూకంప ధాటికి ఇప్పటివరకు రెండు వేల మందికి పైగా మరణించారు. 400 మందికి పైగా గాయపడ్డారు.
హేరాట్ నగరంలో శనివారం మధ్యాహ్నం సమయంలో కేవలం గంట వ్యవధిలోనే వరుసగా ఏడు భూకంపాలు సంభవించాయి. పశ్చిమ అప్గాన్‌లో 6.3 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం కారణంగా పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. వందలాది భవనాలు నేలమట్టమయ్యాయి. భవనాలు కూలిపోవడంతో శిథిలాల కింద నలిగిపోయి ఇప్పటివరకు రెండు వేల మందికి పైగా దుర్మరణం చెందారు. 402 మంది గాయపడ్డారు. కాగా, హేరాట్ నగరానికి వాయవ్య మూల 40 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అమెరికా జియాలాజికల్ సర్వే వెల్లడించింది. కాగా, అఫ్గాన్‌లో తరచూ ఏర్పడే భూకంపాల కారణంగా తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టం ఏర్పడుతుంది. గత ఏడాది జనవరిలో ఏర్పడిన భారీ భూకంపం వల్ల వెయ్యి మంది మృతి చెందగా, వేలాది మంది నిరాశ్రయులయ్యారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

