US Shutdown | షట్‌డౌన్‌తో విమాన సేవల్లో కోత.. అమెరికా వ్యాప్తంగా ఒక్కరోజే వెయ్యికిపైగా ఫ్లైట్స్ రద్దు
US Shutdown | అగ్రరాజ్యం అమెరికాలో ప్రభుత్వ షట్‌డౌన్ (US Shutdown) కొనసాగుతోంది. దేశ చరిత్రలోనే అత్యధిక కాలం కొనసాగుతున్న షట్డౌన్గా ఇది చరిత్ర సృష్టించింది.
US Shutdown | అగ్రరాజ్యం అమెరికాలో ప్రభుత్వ షట్‌డౌన్ (US Shutdown) కొనసాగుతోంది. దేశ చరిత్రలోనే అత్యధిక కాలం కొనసాగుతున్న షట్డౌన్గా ఇది చరిత్ర సృష్టించింది. ఈ షట్‌డౌన్‌తో లక్షలాది మంది అమెరికన్ల జీవితాలు సంక్షోభంలో చిక్కుకున్నాయి. ఈ షట్‌డౌన్ దేశంలోని పలు విమానాశ్రయాలపై తీవ్ర ప్రభావం పడిన (Flights ) విషయం తెలిసిందే. షట్‌డౌన్ సమయంలో ఎలాంటి జీతం లేకుండా పనిచేస్తున్న ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు, టీఎస్ఏ సిబ్బంది అనారోగ్య కారణాలతో విధులకు గైర్హాజర్ కావడంతో దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాలలో విమానాల రాకపోకలు ఆలస్యంగా జరుగుతున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
పరిమిత సంఖ్యలో ఉన్న ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్‌పై ఒత్తిడి తగ్గించడానికే ప్రభుత్వం విమాన సేవల్లో కోత విధించింది. ఈ విషయాన్ని దేశ రవాణా శాఖ మంత్రి సీన్ డఫీ ఇటీవలే ప్రకటించారు. దీని ప్రకారం దేశంలోని రద్దీ ఎక్కువగా ఉండే అట్లాంటా, న్యూవార్క్, డెన్వర్, చికాగో, హ్యూస్టన్, లాస్ ఏంజిల్స్ సహా 40 ప్రాంతాల్లో 10 శాతం విమాన సర్వీసులను రద్దు చేయాలని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఆదేశించింది. దీనిని శుక్రవారం నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. దీంతో శుక్రవారం ఒక్కరోజే దేశంలో 1000కిపైగా విమానాలు ఆలస్యమయ్యాయి. ట్రాకింగ్ వెబ్సైట్ FlightAware ప్రకారం నిన్న ఒక్కరోజే ఏకంగా 1,200 ఫ్లైట్లు రద్దయ్యాయి. ఇది గురువారం కంటే ఐదు రెట్లు ఎక్కువ. రేగన్ జాతీయ విమానాశ్రయంపై దీని ప్రభావం ఎక్కువగా పడింది. 18శాతం అంటే 81 విమానాలు రద్దయ్యాయి. షికాగో ఓ హేర్, అట్లాంటా, డల్లాస్, డెన్వర్ వంటి కేంద్రాల్లో కూడా 3% వరకు విమానాలు రద్దయ్యాయి. విమానాల రద్దుతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ చూడలేదని పేర్కొంటున్నారు.
సేనేట్‌లో రిపబ్లికన్లు ప్రవేశపెట్టిన ఫెడరల్ నిధులకు చెందిన బిల్లుకు (funding bill) ఆమోదం దక్కకపోవడంతో అక్టోబర్ 1న అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ షట్‌డౌన్ నేటితో 38వ రోజుకు చేరుకుంది. దేశ చరిత్రలోనే అత్యధిక కాలం కొనసాగుతున్న షట్డౌన్గా ఇది చరిత్ర సృష్టించింది. ఈ షట్‌డౌన్‌తో లక్షలాది మంది అమెరికన్ల జీవితాలు సంక్షోభంలో చిక్కుకున్నాయి. ఆహార సహాయంతోపాటు సామాన్య ప్రజల నిత్య జీవితంలోని కీలక అంశాలకు సంబంధించిన కార్యక్రమాలకు ప్రభుత్వ నిధులు కోతపడగా విమాన ప్రయాణాలలో ఆలస్యాలు, జీతం లేకుండా వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికులు పనిచేస్తుండడంతో ప్రజల జీవితాలపై ఈ షట్‌డౌన్ తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ఇప్పటికీ ఇది ముగిసే అవకాశాలు కనిపించడం లేదు.
Also Read..
Donald Trump | ఆయన సమ్‌థింగ్ స్పెషల్.. వివేక్ రామస్వామిపై ట్రంప్ ప్రశంసలు
Donald Trump | జీ20 శిఖరాగ్ర సమావేశాన్ని బహిష్కరించిన ట్రంప్..
Mali | మాలిలో ఐదుగురు భారతీయులు కిడ్నాప్
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | ‘రామాయణ’ రన్‌టైమ్ 3 గంటల 15 నిమిషాలా .. సినిమా నిడివిపై ఆసక్తికర ప్రచారం!
Jailer 2 | ‘జైలర్ 2’పై తెలుగు ప్రేక్షకుల అసంతృప్తి.. ప్రమోషన్లు లేవు, బాలయ్య క్యామియో కూడా మిస్సింగ్!
దళిత యువకుడికి అవమానం.. ఆలయంలోకి వెళ్లినందుకు దూషణలు
Goutham Raju | నా ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేయోద్దు.. ఆ వార్తలపై సీనియర్ నటుడు గౌతం రాజు ఆవేదన!
Singareni | బీఆర్ఎస్ పాలన సింగరేణికి స్వర్ణయుగం.. ఉత్పత్తి, ఆదాయం, లాభాల్లో గణనీయ వృద్ధి!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

