మెక్సికో సిటీ: కుమార్తె కళ్ల ముందే తల్లిపై షార్క్ దాడి చేసింది. (Shark Attack) ఆమె కాలును కొరికి తినేసింది. ఈ సంఘటనలో ఆ మహిళ మరణించింది. మెక్సికోలోని మెలాక్ బీచ్‌లో ఈ సంఘటన జరిగింది. శనివారం 26 ఏళ్ల మరియా ఫెర్నాండెజ్ మార్టినెజ్ జిమెనెజ్ అనే మహిళ తన కుమార్తెతో కలిసి బీచ్‌లో ఈత కొట్టింది. ఇంతలో ఒక షార్క్ ఆమెపై దాడి చేసింది. ప్రమాదాన్ని పసిగట్టిన ఆ మహిళ వెంటనే కూతురైన చిన్నారిని రక్షించేందుకు ప్రయత్నించింది. తేలియాడే ఫ్లాట్ఫారమ్పైకి కుమార్తెను నెట్టింది.
కాగా, మారియా కాలును షార్క్ కొరికి తినేంది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆమె అతికష్టం మీద బీచ్ ఒడ్డుకు చేరుకుంది. అయితే ఆ మహిళకు ఒక కాలు తెగడం చూసి అక్కడున్న వారు షాక్ అయ్యారు. ఎమర్జెన్సీ బృందం వైద్య సేవలందించినప్పటికీ ఫలితం లేకపోయింది. తీవ్ర రక్తస్రావంతో ఆమె చనిపోయింది.
మరోవైపు ఈ విషాద సంఘటనపై బీచ్ అధికారులు స్పందించారు. బీచ్‌లోకి వెళ్లవద్దని సందర్శకులు, స్థానికులను హెచ్చరించారు. బీచ్‌లో జరుగనున్న స్విమ్మింగ్ పోటీలను నిలిపివేశారు. అలాగే షార్క్ దాడి జరిగిన మెలాక్ బీచ్‌తోపాటు సమీపంలోని ఇతర బీచ్‌లను కూడా అధికారులు మూసివేశారు.