బుధవారం 08 ఏప్రిల్ 2020
International - Feb 11, 2020 , 12:56:45

లండన్‌లో ఓలా క్యాబ్‌ సేవలు షురూ..!

లండన్‌లో ఓలా క్యాబ్‌ సేవలు షురూ..!

భారతీయ క్యాబ్‌ సర్వీసుల కంపెనీ ఓలా లండన్‌లో తన సేవలను మొదలుపెట్టింది. సోమవారం నుంచి లండన్‌లో ఓలా క్యాబ్‌ సేవలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో ఇప్పటికే అక్కడ 25వేల మంది డ్రైవర్లు ఓలా ప్లాట్‌ఫాంపై పనిచేసేందుకు రిజిస్టర్‌ చేసుకున్నారు. ఇక వీరికి ఇప్పటికే హై లెవల్‌ ఇంగ్లిష్‌ స్పీకింగ్‌, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌లో శిక్షణ  ఇచ్చామని ఓలా కంపెనీ తెలిపింది. దీంతో ప్రయాణికులు సులభంగా ఓలా క్యాబ్‌ సేవలను ఉపయోగించుకోవచ్చని ఆ కంపెనీ తెలియజేసింది. 

కాగా క్యాబ్‌ సేవల ప్రారంభం సందర్భంగా లండన్‌లోని కస్టమర్లు మొదటి వారం రోజుల పాటు 25 గ్రేట్‌ బ్రిటన్‌ పౌండ్ల (దాదాపుగా రూ.2300) విలువైన వోచర్లను పొందవచ్చని ఓలా తెలిపింది. అలాగే మొదటి 6 వారాల పాటు తమ డ్రైవర్ల నుంచి ఎలాంటి కమిషన్‌ను తీసుకోబోమని ఓలా తెలిపింది. కాగా ఇప్పటికే యూకేలోని బర్మింగ్‌హామ్‌, లివర్‌పూర్‌, రీడింగ్‌ సిటీలలో ఓలా క్యాబ్‌ సేవలను గత 7 నెలల కాలంలో ప్రారంభించగా ఇప్పుడు ఆ జాబితాలోకి లండన్‌ వచ్చి చేరడం విశేషం. 


logo