Lottery | లాటరీలో మిలియన్ డాలర్లు గెలుచుకున్న మహిళ.. పట్టరాని సంతోషంతో స్టేజ్‌పైనే పడిపోయి
Lottery | సాధారణంగా లాటరీ (Lottery)లో రూ.లక్షల్లో గెలుచుకుంటేనే అమ్మో.. అంతనా అంటుంటాం. అలాంటిది రూ.కోట్లు గెలుచుకుంటే..! పట్టరాని సంతోషంతో ఎగిరి గంతేస్తాం. అలాంటి అనుభవమే ఓ మహిళకు ఎదురైంది.
Lottery | సాధారణంగా లాటరీ (Lottery)లో రూ.లక్షల్లో గెలుచుకుంటేనే అమ్మో.. అంతనా అంటుంటాం. అలాంటిది రూ.కోట్లు గెలుచుకుంటే..! పట్టరాని సంతోషంతో ఎగిరి గంతేస్తాం. అలాంటి అనుభవమే ఓ మహిళకు ఎదురైంది. అయితే, ఆమె ఆనందం పట్టలేక స్టేజ్‌పైనే కుప్పకూలిపోయింది. ఈ ఘటన అమెరికాలోని నార్త్ కరోలినాలో చోటు చేసుకుంది.
నూతన సంవత్సరం సందర్భంగా మిలియన్ డాలర్లు (million dollars ) గెలుపొందే అవకాశం కోసం దేశవ్యాప్తంగా మొత్తం ఐదుగురిని పవర్‌బాల్ ప్లేయర్లను ఎంపిక చేశారు. అందులో నార్త్ కరోలినా (North Carolina) కు చెందిన పమేలా బ్రాడ్షా ( Pamela Bradshaw) ఒకరు. లాటరీ డ్రాలో భాగంగా బంతులన్నీ మిషిన్‌లో తిరిగాక ఓ బంతిని తీసి వదిలితే అది పమేలా నంబర్ అయిన ఒకటిని ప్రదర్శించింది. దీంతో నిర్వాహకులు ‘పమేలా యూ ఆర్ ఏ మిలియనీర్’ అంటూ స్టేజ్‌పై ప్రకటించారు.
ఈ ప్రకటనతో పమేలా ఆనందం తట్టుకోలేకపోయింది. స్టేజ్‌పైనే ఒక్కసారిగా పడిపోయింది. దీంతో నిర్వాహకులు ఆమెను పైకి లేపారు. ఆ తర్వాత కూడా ఆమె ‘ఓ మై గాడ్’ అంటూ తనను తాను నమ్మలేకపోయింది. లాటరీలో పెద్ద మొత్తంలో సొమ్ము గెలుచుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేసింది. ఈ లాటరీ ద్వారా సొంతం చేసుకున్న డబ్బుతో ఓ ఇంటిని కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించింది. ఈ డబ్బుతోపాటు ఆమె మరో అవకాశాన్ని కూడా సొంతం చేసుకుంది. గతంలో ఎప్పుడూ న్యూయార్క్ సందర్శించని ఆమెకు స్టేట్ లాటరీ ద్వారా న్యూయార్క్ సందర్శించే వీఐపీ ట్రిన్ను కూడా సొంతం చేసుకుంది.
Also Read..
Truck Drivers | ట్రక్కు డ్రైవర్ల రాస్తారోకో.. పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరిన జనం
Coronavirus | దేశంలో 4,565కి పెరిగిన క్రియాశీల కేసులు.. కొత్తగా 573 మందికి కొవిడ్ పాజిటివ్
Japan Earthquake | 30కి చేరిన జపాన్ భూకంపం మృతుల సంఖ్య.. ఇషికావా నగరంలోనే అత్యధికం
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Salaar 2 | ప్రభాస్ పుట్టినరోజు వేళ ‘సలార్ 2’పై మేకర్స్ క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు!
Ishan Kishan: ఇషాన్ కిషన్‌కు గాయం.. రెండో టీ20 మ్యాచ్‌కు దూరం
Adarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ఎఫెక్ట్.. విడుదల తేదీలు మార్చుకున్న చిన్న సినిమాలు!
Viral Video | రీల్స్ పిచ్చిలో పెట్రోల్ తాగిన వ్యక్తి! .. సోషల్ మీడియాలో వీడియో వైరల్
Thiruveer | ‘భగవంతుడు’తో రాబోతున్న తిరువీర్.. రూరల్ పొలిటికల్ డ్రామాపై భారీ అంచనాలు!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

