రష్యా దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం… ఉక్రెయిన్‌కు సైనిక దళాలు పంపబోం: నాటో చీఫ్
వాషింగ్టన్: ఉక్రెయిన్‌పై రష్యా దాడిని నాటో తీవ్రంగా ఖండించింది. రష్యా తన సైనిక చర్యను వెంటనే నిలిపివేయాలని, ఉక్రెయిన్ నుంచి దళాలను ఉపసంహరించాలని నాటో సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ కోరారు. అయితే ఉక్రెయిన్‌కు సైనిక దళాలను పంపే ప్రణాళికలు లేవని చెప్పారు. అలాగే ఉక్రెయిన్‌లో నాటో దళాలు కూడా లేవన్నారు. కానీ ఉక్రెయిన్‌కు నాటో సంఘీభావంగా నిలుస్తుందని అన్నారు. నాటో మిత్రదేశాలు చాలా కాలంగా ఆ దేశానికి మద్దతిస్తున్న సంగతిని ఆయన గుర్తు చేశారు. చాలా బలమైన, మెరుగైన సైనిక దళాన్ని నిర్మించడంలో శిక్షణ పరంగా ఉక్రెయిన్‌కు అన్ని విధాలా సహాయం అందించినట్లు తెలిపారు.
కాగా, రష్యా దూకుడు నుంచి కూటమిని కాపాడుకుంటామని నాటో చీఫ్ తెలిపారు. దీని కోసం అవసరమైన చర్యలన్నీ చేస్తున్నట్లు చెప్పారు. తమ గగనతలాన్ని రక్షించుకోవడానికి 100కుపైగా జెట్లు, ఉత్తరం నుంచి మధ్యధరా వరకు సముద్రంలో 120కుపైగా యుద్ధ నౌకలు మోహరించి ఉన్నాయని వెల్లడించారు. తూర్పు భాగంలో నాటో దళాలను మరింతగా పెంచుతున్నట్లు తెలిపారు. అవసరమైనప్పుడు బలగాలను మోహరించడానికి తమ సైనిక కమాండర్లకు మరింత అధికారాన్ని ఇచ్చే రక్షణ ప్రణాళికలను రూపొందించినట్లు వివరించారు. తదుపరి కార్యాచరణపై చర్చించేందుకు నాటో నేతలు శుక్రవారం సమావేశమవుతారని వెల్లడించారు.
నిరంకుశత్వం కంటే ప్రజాస్వామ్యం ఎల్లప్పుడూ ప్రబలంగా ఉంటుందని, అణచివేతపై స్వేచ్ఛ ఎల్లప్పుడూ ప్రబలంగా ఉంటుందని జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ హితవు పలికారు. ఉక్రెయిన్‌పై రష్యా పూర్తి స్థాయి దాడిని ఖండించడంలో నాటో మిత్రదేశాలు కలిసి ఉంటాయని తెలిపారు. అంతర్జాతీయ ఆర్డర్ ఉల్లంఘనను తాము ఎప్పటికీ అంగీకరించబోమని చెప్పారు. ఈ సందేశాన్ని ప్రపంచానికి చాటడంలో తమ మిత్రదేశాలు కలిసి ఉన్నాయన్నారు. ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన రష్యాపై నాటో మిత్రదేశాలతో పాటు ఈయూ తీవ్రమైన ఆర్థిక ఆంక్షలు విధిస్తున్నాయని వెల్లడించారు.
మరోవైపు వైరుధ్యం తమకు చాలా ముఖ్యమని నాటో చీఫ్ తెలిపారు. తమ సైనిక కమాండర్లు, రష్యా మధ్య పరిచయాలు కూడా ఉన్నాయని చెప్పారు. ఉక్రెయిన్‌తో రష్యా వైరాన్ని నివారించేందుకు చేయగలిగినదంతా తాము చేస్తామని అన్నారు. దీని కోసం రష్యాతో సంప్రదింపులు జరుపుతామని వెల్లడించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

