Pfizer vaccine: న్యూజిలాండ్‌లో ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న మహిళ మృతి
కరోనాను సమర్థంగా అడ్డుకున్న న్యూజిలాండ్‌లో తొలి వ్యాక్సిన్ సంబంధిత మరణం సోమవారం నమోదైంది. ఫైజర్ వ్యాక్సిన్( Pfizer vaccine ) తీసుకున్న ఓ మహిళ చనిపోయినట్లు అక్కడి ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

వెల్లింగ్టన్: కరోనాను సమర్థంగా అడ్డుకున్న న్యూజిలాండ్‌లో తొలి వ్యాక్సిన్ సంబంధిత మరణం సోమవారం నమోదైంది. ఫైజర్ వ్యాక్సిన్( Pfizer vaccine ) తీసుకున్న ఓ మహిళ చనిపోయినట్లు అక్కడి ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే ఆ మహిళ వయసు ఎంత అన్నది మాత్రం చెప్పలేదు. ఫైజర్ వ్యాక్సిన్ వల్ల కలిగే అత్యంత అరుదైన అనర్థం అయిన మయోకార్డిటిస్ (గుండె కండరాల్లో ఇన్‌ఫ్లేమేషన్) వల్లే ఆ మహిళ చనిపోయినట్లు భావిస్తున్నారు. ఫైజర్ కొవిడ్-19 వ్యాక్సిన్ వల్ల న్యూజిలాండ్‌లో సంభవించిన తొలి మరణంగా తన ప్రకటనలో చెప్పింది.
సదరు మహిళ ఇప్పటికే పలు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటోందని ఆరోగ్య శాఖ తెలిపింది. అయితే ఫైజర్ వ్యాక్సిన్ వల్ల కలిగే అనర్థాల కంటే ప్రయోజనాలే అధికంగా ఉన్నట్లు కూడా స్పష్టం చేసింది. ఇప్పటి వరకూ న్యూజిలాండ్‌లో ఫైజర్‌తోపాటు జాన్సెన్, ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్లకు అనుమతి ఇచ్చారు. అయితే సాధారణ ప్రజలకు ఇవ్వడానికి మాత్రం ఇప్పటికైతే ఫైజర్‌కు మాత్రమే అనుమతి ఉంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

