Earthquake | న్యూజిలాండ్‌లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.9 తీవ్రత నమోదు
Earthquake | న్యూజిలాండ్ (New zealand) లో భారీ భూకంపం (Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేలు (Ricter Scale) పై దాని తీవ్రత 5.9 గా నమోదైంది. సౌత్ ఐలాండ్ (South Island) లోని 'తే అనావ్ (Te Anau)' పట్టణానికి సమీపంలో భూకంపం సంభవించడంతో అధికారులు తొలుత సునామీ హెచ్చరికలు జారీచేశారు.
Earthquake : న్యూజిలాండ్ (New zealand) లో భారీ భూకంపం (Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేలు (Ricter Scale) పై దాని తీవ్రత 5.9 గా నమోదైంది. సౌత్ ఐలాండ్ (South Island) లోని ‘తే అనావ్ (Te Anau)’ పట్టణానికి సమీపంలో భూకంపం సంభవించడంతో అధికారులు తొలుత సునామీ హెచ్చరికలు జారీచేశారు. అయితే ఆ తర్వాత పరిస్థితిని సమీక్షించి ఆ హెచ్చరికను కేవలం సునామీ సలహాగా సవరించారు. తే అనావ్ పట్టణానికి ఉత్తరంగా దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
ప్రారంభంలో ఈ భూకంప తీవ్రతను 6.3 గా అంచనా వేసిన అధికారులు.. సౌత్ ఐలాండ్ పశ్చిమ తీర ప్రాంతాలైన మిల్ఫోర్డ్ సౌండ్ నుంచి పుయ్‌సెగర్ పాయింట్ వరకు సునామీ హెచ్చరికలు జారీచేశారు. అయితే ఖచ్చితమైన అంచనాల ఆధారంగా భూకంప తీవ్రతను 5.9గా నిర్ధారించి సునామీ హెచ్చరికను తగ్గించారు. ప్రస్తుతానికి సునామీ ముప్పు లేనప్పటికీ, న్యూజిలాండ్ జాతీయ అత్యవసర నిర్వహణ సంస్థ తీరప్రాంత ప్రజలను అప్రమత్తం చేసింది.
తీర ప్రాంతాల్లో బలమైన, అసాధారణమైన అలల కదలికలు, అంచనా వేయలేని నీటి ఉప్పెనలు సంభవించే అవకాశం ఉందని పేర్కొన్నది. ప్రజలు, పర్యాటకులు సముద్రంలోకి వెళ్లవద్దని, బీచ్‌లకు దూరంగా ఉండాలని సూచించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP | ప్రభుత్వంలో భయం పుట్టింది.. సీఈసీపై పోరును తమపై పోరుగా మల్చుకుంది : సీజేపీ
man pushes girlfriend into gorge | బ్రేకప్ చెప్పిన ప్రియురాలు.. ఆమెను లోయలోకి తోసేసిన ప్రియుడు
Kiran Abbavaram | రొటీన్ సినిమాలకు చెక్ పెట్టి కొత్త ప్రయోగాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం!
CJP Protest | కోర్టు ఆదేశించినా కొనసాగుతున్న అరెస్టుల పర్వం.. ఢిల్లీలో పలువురు నేతల నిర్బంధం
Foreign Gold Seize | విశాఖలో 5.83 కిలోల విదేశి బంగారం పట్టివేత..దాని విలువ ఎంతంటే ?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

