New York Police: న్యూయార్క్‌లో తగ్గిన తుపాకీ హింస.. 5 రోజులుగా కాల్పుల బాధితులు లేరు.. 30 ఏళ్లలో కొత్త రికార్డు
New York Police: న్యూయార్క్ నగరం కొత్త చరిత్ర సృష్టించింది. ఆ నగరంలో తుపాకీలు మూగబోయాయి. గత 5 రోజుల నుంచి కాల్పుల్లో మరణించిన వారు కానీ, గాయపడ్డవారు కానీ, బాధితులు ఎవరూ లేరని ఎన్‌వైపీడీ ప్రకటించింది. 30 ఏళ్లల్లో ఇలా జరగడం మొదటిసారి అని పేర్కొన్నది.
న్యూయార్క్: న్యూయార్క్ పోలీసు(New York Police) శాఖ కీలక ప్రకటన చేసింది. నగరంలో గత అయిదు రోజుల నుంచి కాల్పుల ఘటనల వల్ల ఎటువంటి మరణాలు కానీ, గాయాలు కానీ చోటుచేసుకోలేదని పేర్కొన్నది. గడిచిన 30 ఏళ్ల నుంచి తొలిసారి ఇలా జరిగినట్లు పోలీసు శాఖ తెలిపింది. న్యూయార్క్ సిటీ కాప్స్ శాఖ తన ట్విట్టర్లో ఇవాళ ఓ పోస్టు పెట్టింది. 30 ఏళ్లలో తొలిసారి, వరుసగా అయిదు రోజుల నుంచి ఎటువంటి తుపాకీ హింస చోటుచేసుకోలేదని చెప్పింది. కంప్యూటర్ స్టాటిస్టిక్స్ నమోదు చేస్తున్న నాటి నుంచి తొలి సారి షూటింగ్ బాధితులు లేరని పోలీసులు శాఖ తెలిపింది. ఎన్‌వైపీడీ బృందం సాహసోపేత విధనిర్వహణ వల్ల నగరంలో తుపాకీ కాల్పుల సంఘటనల లేవని సిటీ పోలీసులు పేర్కొన్నారు.
ఈ ఏడాది న్యూ ఇయర్ రోజున క్వీన్స్‌లో ఉన్న నైట్‌క్లబ్‌లో చివరి సారి షూటింగ్ ఘటన నమోదు అయ్యింది. ఆ కాల్పుల్లో 11 మంది గాయపడ్డారు. డిసెంబర్ 2024లో కూడా న్యూయార్క్‌లో గన్ సంబంధిత మరణాలు చోటుచేసుకోలేదు. కానీ డిసెంబర్ 2023లో మాత్రం తుపాకీ హింసకు 9 మంది బలైనట్లు ఎన్‌వైపీడీ డేటా పేర్కొన్నది. న్యూయార్క్ సిటీలో వరుసగా మూడవ సంవత్సరం కూడా కాల్పుల సంబంధిత హింసాత్మక ఘటనల సంఖ్య తగ్గినట్లు పోలీసులు వెల్లడించారు.
2024లో నగరంలో క్రైం రేటు తగ్గిందని, 3662 హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయని, 2023తో పోలిస్తే వేలల్లో బాధితుల సంఖ్య తగ్గినట్లు న్యూయార్క్ సిటీ పోలీసు చీఫ్ జెస్సికా వెల్లడించారు. 2023తో పోలిస్తే.. 2024లో కాల్పులు ఘటనలు 7.3 శాతం, కాల్పుల బాధితులు 4.2 శాతం తగ్గినట్లు ఎన్‌వైపీడీ డేటా పేర్కొన్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

