Most Expensive Cities | ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాల జాబితాలో న్యూయార్క్, సింగపూర్ తొలి స్థానంలో నిలిచాయి. 2022 ఏడాదికి గానూ.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాల జాబితాను ఎకనమిస్ట్ ఇంటిలిజెన్స్ యూనిట్ అనే సంస్థ తాజాగా విడుదల చేసింది. వరల్డ్‌వైడ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ రిపోర్ట్ ఆధారంగా రూపొందించిన ఈ జాబితా ప్రకారం.. ప్రపంచంలోనే 172 ప్రధాన నగరాల్లో జీవన వ్యయం గతేడాదితో పోలిస్తే సగటున 8.1 శాతం పెరిగింది.
గతేడాది విడుదలైన అత్యంత ఖరీదైన నగరాల జాబితాలో తొలి స్థానంలో నిలిచిన ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ నగరం ఈసారి మూడో స్థానానికి పడిపోయింది. ఇక హాంగ్‌కాంగ్, లాస్ఏంజెల్స్ 4, 5 స్థానాల్లో నిలిచాయి. స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్ ఆరో స్థానం, జెనీవా (స్విట్జర్లాండ్) ఏడో స్థానం, శాన్ఫ్రాన్సిస్కో (అమెరికా) ఎనిమిదో స్థానం, ప్యారిస్ (ఫ్రాన్స్) తొమ్మిదో స్థానం, డెన్మార్క్‌లోని కోపెన్‌హ్యాగెన్, ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరం పదో స్థానంలో నిలిచాయి. కాగా, సిరియా రాజధాని డమాస్కస్, లిబియాలోని ట్రిపోలి.. ప్రపంచంలోనే చీపెస్ట్ నగరాలుగా నిలిచాయి.