NATO vow | ఉక్రెయిన్‌కు మద్దతు కొనసాగుతుందన్న నాటో.. ప్రాణాంతకం కాని సాయం ఎంతైనా చేస్తామని వెల్లడి
NATO vow | రష్యా చేస్తున్న యుద్ధంలో ఉక్రెయిన్‌కు అన్ని రకాలుగా సాయం అందిస్తున్నామని నాటో సెక్రటరీ జనరల్ చెప్పారు. మద్దతు తెలపడంలో వెనకడుగు వేయమన్నారు. నాటో సభ్యదేశాలు ఆయుధాలు, ఇంధనం, ఇతర పరికరాలు ఇస్తున్నాయన్నారు
NATO vow | రష్యా జరుపుతున్న యుద్ధంలో ఉక్రెయిన్‌కు తమ మద్దతు కొనసాగుతుందని నాటో ప్రతిజ్ఞ చేసింది. ఈ విషయంలో అడుగు వెనక్కి తీసుకునే మాట లేదని నాటో చీఫ్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌కు వాయు రక్షణ వ్యవస్థలు, ఇతర ఆయుధ సంపత్తిని అందించడం కొనసాగించాలని నాటో సభ్య దేశాలకు ఆయన పిలుపునిచ్చారు. వచ్చే వారం రొమేనియాలో జరుగనున్న నాటో విదేశాంగ మంత్రుల సమావేశానికి ముందు నాటో సెక్రటరీ జనరల్ మీడియాతో మాట్లాడారు.
రష్యాతో పోరును కొనసాగిస్తున్న ఉక్రెయిన్‌కు సైనిక, మానవతా సాయం అందించడంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ ప్రకటించారు. యుద్ధం ఎంత కాలం పాటు కొనసాగినా ఉక్రెయిన్ వైపు నిలుస్తామన్నారు. ప్రాణాంతకం కాని సహాయం ఎంతైనా చేస్తామని చెప్పారు. యుద్ధ పరిణామాలు శాంతి చర్చలపై ఆధారపడి ఉంటాయని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో రష్యాతో చర్చలు జరుపాలని ఉక్రెయిన్‌పై ఒత్తిడి తీసుకురాలేమని స్పష్టం చేశారు.
రష్యాను ఎదుర్కొనేందుకు ఇంధనం, వైద్య సామగ్రి, వింటర్ ఎక్విప్మెంట్, డ్రోన్ జామర్‌ను ఉక్రెయిన్‌కు నాటో దేశాలు అందిస్తున్నాయని జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ తెలిపారు. బుకారెస్ట్ సమావేశంలో మరింత సాయం చేయమని నాటో సభ్య దేశాలను కోరతానని చెప్పారు. సోవియట్ యుద్ధ పరికరాల నుంచి రక్షణకు ఉక్రెయిన్ సైన్యానికి ఆధునిక శిక్షణ అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

