న్యూయార్క్: మెట్ గాలా ఫ్యాషన్ షోలో.. నటాషా పూనావాలా ధగధగలాడింది. ఇండియన్ శారీ అవుట్‌ఫిట్‌లో ఆమె అందర్నీ ఇంప్రెస్ చేసింది. న్యూయార్క్‌లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్‌లో మెట్ గాలా 2022 ఫ్యాషన్ షో జరిగింది. సబ్యసాచి రూపొందించిన చీరలో నటాషా మెరుపులు మెరిసింది. సెన్షేషనల్ స్టయిల్లో అందర్నీ అట్రాక్ట్ చేసింది. నటాషా వెరైటీ ఫ్యాషన్ లుక్ ఫోటోలను డిజైనర్ సబ్యసాచి తన ఇన్‌స్టాలో పోస్టు చేశారు.
ఇన్ అమెరికా: యాన్ ఆంథోలజీ ఆఫ్ ఫ్యాషన్ అన్న థీమ్‌పై ఈ ఏడాది ఈవెంట్‌ను ఆర్గనైజ్ చేశారు. మెటాలిక్ కలర్ డ్రెస్సులో నటాషా మెస్మరైజ్ చేసింది. నటాషా కట్టుకున్న చీర చాలా ప్రత్యేకమైందని, విశిష్టమైన వస్త్రధారణ అని సబ్యసాచి తన ఇన్‌స్టాలో రాశారు. గ్లోబల్ ఫ్యాషన్ వేడుకల్లో ఎప్పుడు ఇండియన్ చీరకు ఆ గౌరవం దక్కుతుందా అని ఎదురుచూసేవాడినని సబ్యసాచి అన్నారు. సెలబ్రిటీ స్టయిలిస్ట్ అనితా ష్రాఫ్ అదజానియా.. నటాషా లుక్‌ను తీర్చిదిద్దారు. బంగారు ఆభరణాలు, చెవి రింగులు, గాజులు ధరించిన నటాషా ఓ దివ్య అవతారంలా కనిపించింది. సీరం ఇన్స్టిట్యూట్ సీఈవో ఆధార్ పూనావాలా భార్యే నటాషా పూనావాలా.