న్యూయార్క్ : నాసాకు చెందిన మార్స్ అట్మాస్ఫియర్ అండ్ వోలటైల్ ఎవల్యూషన్ (మావెన్) అంతరిక్ష నౌక అంగారకుడిపై వాతావరణ మార్పులకు సంబంధించిన మూడు అరుదైన ఫొటోలను తీసింది. ఇందులో ఓజోన్ ప్రభావాన్ని తెలిపే ఫొటోలున్నాయని, వాతావరణాన్ని అధ్యయనం చేసేందుకు ఈ ఫొటోలు ఉపయోగపడతాయని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు.