NASA | క్లియర్‌గా కెమెరాకు చిక్కిన పాలపుంత కంటే పెద్ద గెలాక్సీ.. ఫొటోలు వైరల్
NASA | అంతరిక్షంలో మనం ఒక మూలన ఉన్నాం. ఇక్కడి నుంచి రోదసిలోకి చూసేకొద్దీ మన దిమ్మతిరిగిపోయే అద్భుతాలు కనిపిస్తూనే ఉంటాయి. అలాంటి వాటిలో గెలాక్సీలు కూడా ఒకటి. మన పాలపుంత సైజు తెలిస్తేనే అంత పెద్దదా?
అంతరిక్షంలో మనం ఒక మూలన ఉన్నాం. ఇక్కడి నుంచి రోదసిలోకి చూసేకొద్దీ మన దిమ్మతిరిగిపోయే అద్భుతాలు కనిపిస్తూనే ఉంటాయి. అలాంటి వాటిలో గెలాక్సీలు కూడా ఒకటి. మన పాలపుంత సైజు తెలిస్తేనే అంత పెద్దదా? అనుకుంటాం. కానీ దీని కన్నా పెద్ద గెలాక్సీలు అంతరిక్షంలో బోలెడన్ని ఉన్నాయి. వీటిని ఇప్పటి వరకు స్పష్టంగా చూడటం మన వల్ల కాలేదు.
హబుల్ టెలిస్కోప్ తయారుచేసి అంతరిక్షంలోకి పంపినా కూడా.. అది కచ్చితమైన చిత్రాలను మనకు పంపలేకపోయింది. ఈ క్రమంలోనే నాసా పరిశోధకులు జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్‌ను తయారు చేశారు. ఇది అంతరిక్షంలోని అనేక విషయాలను ఎన్నోరెట్లు స్పష్టంగా ఫొటోలు తీసి మనకు అందజేస్తోంది. తాజాగా ఈ టెలిస్కోప్.. ఐసీ 5332 అనే గెలాక్సీని ఫొటో తీసింది. ఇంతకుముందు హబుల్ కూడా దీన్ని ఫొటో తీసినా దానిలో స్పష్టత లోపించింది.

(హబుల్ తీసిన ఫొటో)
వెబ్ టెలిస్కోప అద్దాలు కూడా కావలసినంత చల్లగా లేకపోవడంతో.. ఇక్కడి మిడ్ ఇన్ఫ్రారెడ్ ప్రాంతాలను తన కెమెరాలో బంధించలేకపోయింది. ఈ క్రమంలోనే ఈసారి వెబ్ టెలిస్కోప్‌లోని మిరి (మిడ్ ఇన్ఫ్రారెడ్ ఇన్స్ట్రుమెంట్స్) ఉపయోగించి ఈ గెలాక్సీ ఫొటో తీశారు శాస్త్రవేత్తలు. ఇది -266 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో కూడా పనిచేస్తుందట.
మిరిని ఉపయోగించి తీసిన ఫొటోల్లో ఐసీ5332 గెలాక్సీ రూపురేఖలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీని వెడల్పు 66 వేల కాంతి సంవత్సరాలు ఉంటుందని, ఇది మన పాలపుంత కంటే చాలా పెద్దదని సైంటిస్టులు చెప్తున్నారు. అంతేకాదు, ఇది మన భూమి వైపే చూస్తున్నట్లు ఉండటంతో ఈ గెలాక్సీని పరిశీలించడం కొంత సులభంగా ఉంటుందని వాళ్లు తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Galaxy
- JWST
- NASA
- Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

