Mysterious Streaks Of Light | అమెరికా (America) లోని కాలిఫోర్నియా (California) రాష్ట్రంలో వింత దృశ్యాలు (Mysterious Streaks Of Light) దర్శనమిచ్చాయి. ఆకాశంలో అంతుచిక్కని వెలుగు రేఖలు కనిపించాయి. ఆ వెలుగు రేఖలు కొన్ని సెకండ్ల పాటు మాత్రమే కనిపించి అదృశ్యమయ్యాయి. నీలాకాశంలో అంతుచిక్కని వెలుగులతో ఒకింత ఆశ్యర్యానికి గురైన ప్రజలు.. ఆ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఆ వీడియోలు వైరల్ అవుతున్నాయి.
అంతరిక్షం నుంచి వచ్చిపడ్డ శకలాలు భూవాతావరణంలో మండిపోవడం వల్లే ఆ కాంతి చారలు ఏర్పడి ఉంటాయని జోనాథన్ మెక్‌డోవెల్ అనే ఖగోళశాస్త్రవేత్త పేర్కొన్నారు. భూ కక్ష్యలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో జపాన్‌కు చెందిన ఒక కమ్యూనికేషన్ సాధనం ఉండేదన్నారు. అది సమాచారాన్ని తొలుత ఒక ఉపగ్రహానికి, ఆ తర్వాత భూమికి చేరవేసేదని చెప్పారు. దాని బరువు 310 కిలోలని, దాన్ని 2020లో ఐఎస్ఎస్ నుంచి జారవిడిచారని వివరించారు. అది ఇప్పుడు భూ వాతావరణంలోకి ప్రవేశించి, మండిపోయి ఉంటుందని తెలిపారు. ఆ పరిణామం కాంతిచారల్లా కనిపించాయని పేర్కొన్నారు.
Also Read..
Salman Khan | సల్మాన్‌ను చంపేస్తామంటూ బెదిరింపులు.. నటుడి ఇంటి వద్ద భద్రత కట్టుదిట్టం
India Corona | దేశంలో మళ్లీ పెరుగుతున్న కొవిడ్ కేసులు.. గత 24 గంటల్లో ఎన్ని కేసులంటే..?
Mamata Banerjee | మోదీకి రాహుల్ గాంధీ ‘అతిపెద్ద టీఆర్పీ’ : మమతా బెనర్జీ