Mysterious creature | అంటార్కిటికాలో 20 చేతుల వింత జీవి.. వైరల్ అవుతున్న ఫొటో
Mysterious creature | అంటార్కిటిక్ సముద్రంలో ఓ వింత జీవి దర్శనమిచ్చింది. స్ట్రాబెర్రీ ఆకారంలో ఉన్న దాని దేహం చుట్టూ చేతుల్లాగా 20 శాఖలు ఉన్నాయి. ఇటీవల సముద్ర జీవుల పరిశోధన కోసం ఓడలో వెళ్లిన శాస్త్రవేత్తలు ఈ విశిష్ట ఆకారంలో ఉన్న జీవిని గుర్తించారు.
న్యూఢిల్లీ: అంటార్కిటిక్ సముద్రంలో ఓ వింత జీవి దర్శనమిచ్చింది. స్ట్రాబెర్రీ ఆకారంలో ఉన్న దాని దేహం చుట్టూ చేతుల్లాగా 20 శాఖలు ఉన్నాయి. ఇటీవల సముద్ర జీవుల పరిశోధన కోసం ఓడలో వెళ్లిన శాస్త్రవేత్తలు ఈ విశిష్ట ఆకారంలో ఉన్న జీవిని గుర్తించారు. ఈ వింత జీవికి శాస్త్రీయంగా ‘ప్రోమాకోక్రినస్ ఫ్రగారియస్’ అని నామకరణం చేశారు.
అదేవిధంగా ‘అంటార్కిటిక్ స్ట్రాబెర్రీ ఫెదర్ స్టార్’ అనే సాధారణ పేరును కూడా విలక్షణ జీవికి పెట్టారు. ఇరవై శాఖలతో స్ట్రాబెర్రీ ఆకారంలో దేహాన్ని కలిగి ఉన్నందున దానికి ఆ పేరు పెట్టినట్టు తెలిపారు. ఇలాంటి వింత జీవులు అంటార్కిటిక్ సముద్రంలో 65 అడుగుల నుంచి 6,500 అడుగుల లోతులో ఉంటాయని పేర్కొన్నారు. తాజా వింత జీవికిగల 20 చేతుల్లో రెండు రకాలు ఉన్నాయని, లోపలి వైపు ఉన్న శాఖలు రఫ్‌గా, బలంగా.. బయటి వైపు శాఖలు సన్నగా, ఈకల్లాగా ఉన్నాయని సైంటిస్టులు వెల్లడించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

