Min Aung Hlaing: మయన్మార్ దేశాధ్యక్షుడిగా మిన్ ఆంగ్ ఎన్నిక
Min Aung Hlaing: మయన్మార్ కొత్త దేశాధ్యక్షుడిగా మిన్ ఆంగ్ హయింగ్ను ఇవాళ ఆ దేశ పార్లమెంట్ ఎన్నుకున్నది. మిలిటరీ జనరల్ అయిన మిన్ ఆంగ్.. ఇటీవల తన పదవికి రాజీనామా చేశారు. 2021లో ఆంగ్ సాన్ సూకీ ప్రభుత్వం కూల్చివేతలో మిన్ ఆంగ్ కీలక పాత్ర పోషించారు.
బ్యాంగ్‌కాక్: మయన్మార్ కొత్త దేశాధ్యక్షుడిగా మిన్ ఆంగ్ హయింగ్(Min Aung Hlaing)ను ఇవాళ ఆ దేశ పార్లమెంట్ ఎన్నుకున్నది. మిలిటరీ జనరల్ అయిన మిన్ ఆంగ్.. ఇటీవల తన పదవికి రాజీనామా చేశారు. 2021లో ఆంగ్ సాన్ సూకీ ప్రభుత్వం కూల్చివేతలో మిన్ ఆంగ్ కీలక పాత్ర పోషించారు. సైనిక తిరుగుబాటుకు ఆయన పాల్పడ్డారు. అయితే గత అయిదేళ్ల నుంచి ఆయన మయన్మార్‌లో తన అధికారం పట్టును కోల్పోలేదు. దేశాధ్యక్షుడి పోస్టుకు పోటీపడిన ముగ్గురు నామినీల్లో మిన్ ఆంగ్ హయింగ్ ఒకరు. మిలిటరీ జుంటా మద్దతుతో పాటు ఆయన రాజకీయ మద్దతును కూడా కూడబెట్టుకున్నారు. దీంతో దేశాధ్యక్ష పదవి సులువుగా సొంతం చేసుకున్నారు.
సైనిక తిరుగుబాటు తర్వాత తొలిసారి పార్లమెంట్ సమావేశం అయ్యింది. అయితే దీంట్లో ఎక్కువ శాతం ప్రతినిధులు మిన్ ఆంగ్‌కు మద్దతుగా నిలిచారు. పార్లమెంట్లో సైనిక దళాలకు పావువంతు సీట్లను కేటాయించారు. ఇంకా మిలిటరీకి చెందిన యూఎస్డీపీ పార్టీ ఎన్నికల్లో సుమారు 80 శాతం సీట్లను కైవసం చేసుకున్నది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాంట్లో ఎక్కువ శాతం మిలిటరీ వ్యక్తులే ఉన్నత పదవుల్లో కొనసాగే అవకాశాలు ఉన్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

