Sheikh Hasina: షేక్ హసీనాపై మర్డర్ కేసు నమోదు
Sheikh Hasina: షేక్ హసీనాపై మర్డర్ కేసు నమోదు చేశారు. ఆమెతో పాటు మరో ఆరుగురిపై కేసు బుక్ చేశారు. ఓ సరుకుల దుకాణం ఓనర్ మృతి ఘటనలో భాగంగా కేసును ఫైల్ చేశారు.
ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina)పై మర్డర్ కేసు నమోదు చేశారు. ఆమెతో పాటు మరో ఆరుగురిపై కేసు బుక్ చేశారు. ఓ సరుకుల దుకాణం ఓనర్ మృతి ఘటనలో భాగంగా కేసును ఫైల్ చేశారు. యువత ఆందోళనల నేపథ్యంలో దేశం విడిచి వెళ్లిన మాజీ ప్రధాని హసీనా.. ప్రస్తుతం భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు. అయితే ఆ అల్లర్ల సమయంలో జరిగిన కాల్పుల్లో ఆ షాపు ఓనర్ మృతిచెందాడు.
పరారీ అయిన తర్వాత హసీనాపై నమోదైన తొలి కేసు ఇదే. గ్రాసరీ స్టోర్ ఓనర్ అబూ సయ్యద్‌కు చెందిన మిత్రుడు ఒకరు ఆ కేసును నమోదు చేశారు. అవామీ లీగ్ పార్టీ జనరల్ సెక్రటరీ ఒబైదుల్ ఖాదిర్, మాజీ హోంమంత్రి అసదుజ్మాన్ ఖాన్ కమల్, మాజీ ఐజీ చౌదరీ అబ్దుల్లా ఆల్ మమున్ ఈ కేసులో ఉన్నారు. అనేక మంది ఉన్నత స్థాయి పోలీసు, ప్రభుత్వ అధికారుల పేర్లను కూడా దీంట్లో చేర్చారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

