టాటూ వేయించుకోవడమంటే ఇప్పుడు ఫ్యాషన్. చాలామంది బాడీలో తమ ఇష్టమైన చోట టాటూలు వేయించుకుంటున్నారు. అయితే, బాడీలో ఏ పార్ట్‌పై టాటూ వేసుకుంటే బాధాకరంగా ఉంటుందో చెప్పాడు 848 స్వ్కేర్ టాటూలు వేసుకుని గిన్నిస్‌బుక్ రికార్డుల్లోకెక్కిన యూఎస్ వ్యక్తి మాట్గాన్. ముక్కుపై టాటూ వేసుకునేటప్పుడు తాను ఎక్కువ బాధపడినట్లు వెల్లడించాడు.
మాట్గాన్ 2014లో అత్యధిక టాటూలు వేసుకున్న వ్యక్తిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించాడు. అతడి శరీరంపై ప్రతి స్వ్కేర్ను లెక్కించిన ఇద్దరు వైద్యులు రికార్డును ధ్రువీకరించారు. అప్పటినుంచీ అతను మరో 30 టాటూలు కూడా వేసుకున్నాడు. తన టాటూ అనుభవాలను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ యూట్యూబ్ ఛానెల్లో పంచుకున్నాడు మాట్గాన్.
ముక్కులో టాటూ వేయించుకున్నాక 20 నిమిషాలపాటు తుమ్మితే బ్లాక్ ఇంక్ వచ్చేదని చెప్పాడు. ఇది తాను అనుభవించిన అత్యంత బాధాకరమైన విషయం అని తెలిపాడు. మాట్గాన్ తన నాలుకపై, కనుబొమ్మలపై కూడా టాటూలు వేయించుకున్నాడు. మత్తుమందు ఇచ్చినా కనురెప్పలోపల పచ్చబొట్టు వేసుకునేటప్పుడు చాలానొప్పి ఉంటుందని తెలిపాడు. కనుబొమ్మలపై పచ్చబొట్టు వేయించుకున్న ప్రపంచంలో ఆరో వ్యక్తి తానేనని చెప్పాడు. ఇక నాలుకపై అత్యధికంగా టాటూలు వేసుకున్న వ్యక్తిని చరిత్రలో తానొక్కడినేనని వెల్లడించాడు.