మాస్కో: రష్యా మే 9వ తేదీన విక్టరీ డే పరేడ్ నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ మాస్కోలో విక్టరీ డే పరేడ్ రిహార్సల్స్ జరిగాయి. రెండవ ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీని ఓడించిన సందర్భంగా రష్యా విక్టరీ డే నిర్వహిస్తోంది. ప్రస్తుతం ఉక్రెయిన్పై దాడికి వెళ్లిన రష్యా విక్టరీ డేని మరింత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునేందుకు సిద్ధమైంది. ఉక్రెయిన్ ప్రభుత్వం నియో-నాజీ తరహాలో వ్యవహరిస్తున్నట్లు రష్యా ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో పశ్చిమ దేశాలకు రష్యా తన సైనిక సత్తాను చాటనున్నది. సోమవారం జరిగే పరేడ్ కోసం ఇవాళ డ్రెస్ రిహార్సల్స్ నిర్వహించారు. చాలా కలర్ఫుల్గా ఆ ఈవెంట్ సాగింది.
విక్టరీ డే పరేడ్ నేపథ్యంలో అందరి కళ్లు మాస్కోపై పడ్డాయి. ఆ నగర వీధుల్లో ఇప్పుడు యుద్ధ ట్యాంక్లు కదులుతున్నాయి. రెడ్ స్క్వేర్లో వాతావరణం ఉత్సాహభరితంగా మారింది. పుతిన్ చేపట్టబోయే వ్యూహాంపైనే అందరూ ఆసక్తిగా ఉన్నారు. ఫైటర్ జెట్స్, బాంబర్లు కూడా పరేడ్ కోసం సిద్దం అయ్యాయి. విక్టరీ డే సందర్భంగా యుద్ధ విమానాలతో ఫ్లై పాస్ట్ నిర్వహించనునన్నారు. దేశవ్యాప్తంగా 9వ తేదీన సైనిక ర్యాలీలు ఉంటాయి. అయితే ఈసారి ఉక్రెయిన్పై దాడికి రష్యా ఆ సెలబ్రేషన్స్ ఎలా చేస్తుందో అన్న టెన్షన్ వాతావరణం నెలకొన్నది.