Afghanistan Earthquake | అఫ్ఘానిస్థాన్‌లో భారీ భూకంపం.. 622 మంది మృతి
అఫ్ఘానిస్థాన్‌లో ఘోర ప్రకృతి విపత్తు సంభవించింది. గంటల వ్యవధిలో ఐదు సార్లు భూకంపం (Afghanistan Earthquake) రావడంతో భారీగా ప్రాననష్టం సంభవించింది. ఆదివారం రాత్రి 11.47 గంటల ప్రాంతంలో పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉన్న కునార్ ప్రావిన్స్‌లో 6.0 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది.
కాబూల్: అఫ్ఘానిస్థాన్‌లో ఘోర ప్రకృతి విపత్తు సంభవించింది. గంటల వ్యవధిలో ఐదు సార్లు భూకంపం (Afghanistan Earthquake) రావడంతో భారీగా ప్రాననష్టం సంభవించింది. ఆదివారం రాత్రి 11.47 గంటల ప్రాంతంలో పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉన్న కునార్ ప్రావిన్స్‌లో 6.0 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది. నంగర్హర్ ప్రావిన్స్‌లోని జలాలాబాద్‌కు 27 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని ఎన్సీఎస్ వెల్లడించింది. దీంతో కునార్, లాఘ్మన్ ప్రావిన్సుల్లో భూప్రకంపణలు సంభవించాయి. చాలాచోట్ల భవనాలు కుప్పకూలిపోయాయి. దీంతో ఇప్పటివరకు 622 మంది మరణించారని తాలిబన్ ప్రభుత్వం ప్రకటించింది. మరో 1500 మందికిపైగా గాయపడ్డారని వెల్లడించింది.

భూకంపం ప్రభావం కునార్ ప్రావిన్స్‌లో అత్యధికంగా ఉన్నది. మృతుల్లో 610 మంది ఈ ప్రావిన్స్‌కు చెందినవారే ఉన్నారు. నంగర్హర్ ప్రావిన్స్‌లో 12 మంది ఉన్నారని అధికారులు తెలిపారు. కాగా, భూకంపం ధాటికి పలు గ్రామాల్లోని ఇండ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయని వార్దక్ ప్రావిన్స్ మాజీ మేయర్ జరీఫా ఘఫ్పారీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. విపత్తు ధాటికి కునార్, నోరిస్థాన్, నంగర్హార్ ప్రావిన్సులు తీవ్రంగా నష్టపోయాయన్నారు. ఇండ్లు కూలిపోవడంతో పలు కుటుంబాలు వీధిన పడ్డాయని చెప్పారు. మహిళలు, చిన్నారులు, వృద్ధులు తీవ్ర గాయాలపాలై ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని తెలిపారు. బాధితుల పరిస్థితి దుర్భరంగా ఉందని, కునార్ ప్రజలకు సహాయం అవసరమని వెల్లడించారు.

ప్రతి ఐదు నిమిషాలకు ఒకరు చొప్పున బాధితులు దవాఖానలో చేరుతున్నారని డాక్టర్ ములాదాద్ తెలిపారు. ఆయన కునార్ ప్రావిన్స్ రాజధాని అసదాబాద్‌లో ఉన్న ప్రావిన్సియల్ దవాఖానలో సేవలు అందిస్తున్నారు. ఇప్పటివరకు మహిళలు, చిన్నారులు సహా 188 మంది క్షతగాత్రులు దవాఖానలో చేరారరని వెల్లడించారు. ఇలాంటి పరిస్థితిని గతంలో తామెప్పుడూ చూడలేదని, హాస్పిటల్లో అత్యవసర పరిస్థితి విధించామని తెలిపారు. ప్రస్తుతం భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని అధికారులు తెలిపారు. కాగా, గతేడాది అఫ్ఘానిస్థాన్‌లో వరుసగా సంభవించిన భారీ భూకంపాల వల్ల 1000 మందికిపైగా మరణించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

