Google search | గూగుల్‌లో ఈమె కోసం ఎక్కువ మంది వెతికారంటా..!
Google search | వివిధ విషయాలు, వస్తువులు, వ్యక్తుల గురించి మనం గూగుల్‌లో వెతుకుతాం. ఎక్కువగా వెతికిన వ్యక్తిగా అమెరికా నటి అంబర్ హార్డ్ నిలిచింది. కాగా, యూట్యూబ్, ఫేస్బుక్, ట్రాన్స్‌లేట్ వంటి పదాలను కూడా ఎక్కువగా గూగుల్‌లో వెతికారంట.
Google search | ఏదైనా విషయం గురించి గానీ, వస్తువు గురించి గానీ, వ్యక్తి గురించి గానీ.. తెలుసుకోవాలనుకుంటే వెంటనే మనం గూగుల్‌ను ఒపెన్ చేసి వెతుకుతాం. గూగుల్ వెబ్సైట్ మనకు ఎన్నో విషయాలను ఏర్చి కూర్చి అందిస్తూ ప్రపంచవ్యాప్తంగా అందరి మన్ననలు అందుకుంటున్నది. అయితే, గూగుల్‌లో అత్యధిక మంది దేని కోసం వెతుకుతారు? అనే విషయం చాలా ఆసక్తికరంగా ఉంటుంది.
ప్రస్తుత ఏడాదిలో గూగుల్ వెబ్సైట్లో ఎక్కువ మంది నెటిజెన్లు వెతికింది దేని కోసమంటే.. అనే విషయాలను సిమిలర్‌వెబ్ బ్లాగ్ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది వెతికిన టాప్ 100 కీవర్డ్స్ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో తొలిస్థానం యూట్యూబ్ది కాగా.. తర్వాతి స్థానాల్లో ఫేస్బుక్, ట్రాన్స్‌లేట్, పోర్న్‌హబ్, వెదర్, అమేజాన్, గూగుల్ ట్రాన్స్‌లేట్ జీమెయిల్, వాట్సాప్ వెబ్, ట్రాడక్టర్ చోటు సంపాదించాయి.
కాగా, గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన సెలబ్రిటీల జాబిబాను ప్రముఖ ఎంటర్టైన్మెంట్ వెబ్సైట్ సెలెబ్‌టాట్లర్ విడుదల చేసింది. ఈ సంస్థ నివేదిక ప్రకారం అమెరికన్ నటి అంబర్ హార్డ్ టాప్ ప్లేస్‌లో ఉన్నది. రెండో స్థానంలో హార్డ్ మాజీ భర్త, హాలీవుడ్ నటుడు జానీడెప్ ఉన్నారు. కాగా, ఆ తర్వాతి స్థానాల్లో క్వీన్ ఎలిజబెత్-II, టామ్ బ్రాడీ, కిమ్ కర్దాషియన్, పీట్ డేవిడ్సన్ ఉన్నారు. ఎలాన్ మస్క్ ఏడో స్థానంలో నిలువగా.. విల్‌స్మిత్‌కు ఎనిమిదో స్థానం దక్కింది. ఈ జాబితాలో భారత్ నుంచి ఒక్కరికి కూడా చోటు దక్కలేదు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

