హైదరాబాద్ : ఉక్రెయిన్‌పై రష్యా మిసైళ్ల వర్షం కురిపిస్తోంది. మిలటరీ స్థావరాలను ధ్వంసం చేసింది. యుద్ధ ట్యాంకులు, నావెల్ షిప్స్, వైమానిక దాడులతో ఉక్రెయిన్ను రష్యా చుట్టుముట్టి భీకరమైన యుద్ధం చేస్తోంది. రష్యా ప్రారంభించిన యుద్ధంలో ఉక్రెయిన్‌కు చెందిన 137 మంది పౌరులు చనిపోయినట్లు ఆ దేశ అధికార వర్గాలు వెల్లడించాయి.
ఈ ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఉక్రెయిన్ను చెందిన ఓ సైనికుడు విడుదల చేసిన సందేశం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఆ సైనికుడు తన కుటుంబ సభ్యులకు సందేశాన్ని పంపాడు. మామ్, డాడ్ ఐ లవ్ యూ.. అంటూ అతను పేర్కొన్నాడు. ఈ వీడియోపై నెటిజన్లు స్పందించారు. ఉక్రెయిన్ సైనికుల పట్ల సానుభూతి వ్యక్తం చేశారు. మీరేవరో మాకు తెలియదు.. కానీ మిమ్మల్ని ప్రేమిస్తున్నాము అని ఉక్రెయిన్ సైనికులను ఉద్దేశించి నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.