Mohamed Muizzu | ఏకంగా 15 గంటలు ప్రెస్ కాన్ఫరెన్స్.. మాల్దీవ్స్ అధ్యక్షుడి రికార్డు
Mohamed Muizzu | మాల్దీవుల (Maldives) అధ్యక్షుడు (President) మొహమ్మద్ ముయిజ్జు (Mohamed Muizzu) రికార్డు నెలకొల్పారు. ఏకంగా 15 గంటలపాటు ప్రెస్ కాన్ఫరెన్స్ (Press Conference) నిర్వహించారు. దాంతో ప్రపంచంలో ఈ ఘనత సాధించిన మొదటి దేశాధ్యక్షుడిగా ముయిజ్జు నిలిచారు.
Mohamed Muizzu : మాల్దీవుల (Maldives) అధ్యక్షుడు (President) మొహమ్మద్ ముయిజ్జు (Mohamed Muizzu) రికార్డు నెలకొల్పారు. ఏకంగా 15 గంటలపాటు ప్రెస్ కాన్ఫరెన్స్ (Press Conference) నిర్వహించారు. దాంతో ప్రపంచంలో ఈ ఘనత సాధించిన మొదటి దేశాధ్యక్షుడిగా ముయిజ్జు నిలిచారు. శనివారం ఉదయం 10 గంటలకు ఆయన మారథాన్ ప్రెస్ కాన్ఫరెన్స్ ప్రారంభించారని అధికారులు తెలిపారు.
మధ్యలో ప్రార్థనల కోసం చిన్న విరామం ఇచ్చి 14 గంటల 54 నిమిషాలపాటు ప్రసంగించారని మాల్దీవ్స్ అధ్యక్ష కార్యాలయం అధికారులు చెప్పారు. ఈ సుదీర్ఘ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో చాలా భాగం విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారని తెలిపారు. శనివారం ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ మారథాన్ ప్రెస్ కాన్ఫరెన్స్‌తో ఇప్పటివరకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ (Zelensky) పేరిట ఉన్న రికార్డును ముయిజ్జు అధిగమించినట్లు మాల్దీవుల అధ్యక్ష కార్యాలయం తెలిపింది.
గతంలో 2019 అక్టోబర్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ 14 గంటలపాటు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి రికార్డు నెలకొల్పారు. కాగా 2009లో మాల్దీవుల అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించిన మొహమ్మద్ నషీద్ హిందూ మహాసముద్రం అడుగున క్యాబినెట్ సమావేశం నిర్వహించి ప్రపంచ రికార్డు నెలకొల్పారు. గ్లోబల్ వార్మింగ్ మూలంగా సముద్ర మట్టాలు పెరగడంతో దిగువ స్థాయిలో ఉన్న తమ దేశం మునిగిపోయే ప్రమాదం ఉందని ప్రపంచ దేశాలకు చాటి చెప్పడానికి అప్పట్లో ఆయన ఈ విధంగా వినూత్న నిరసన తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
France Protests | ఫ్రాన్స్ నిరసనకారుల్లో తీవ్రవాద భావజాల అమెరికన్లు..!
Diaper Rash | డైపర్ వాడుతున్న తల్లిదండ్రులకు అలర్ట్.. చిన్నారుల చర్మాన్ని కాపాడేందుకు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
Ramayana | ‘రామాయణం’ నుంచి రావణాసురుడిగా యశ్ అదిరిపోయే గ్లింప్స్.. శివ తాండవ సోత్రంతో భీభత్సం
Energy Boosters | రోజంతా నీరసంగా ఉంటున్నారా? శక్తినిచ్చే 7 ముఖ్యమైన పోషకాలు ఇవే!
గోల్డెన్ డ్రెస్‌లో నభా నటేష్.. అందమైన నవ్వుతో కట్టిపడేస్తోందిగా!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

