‘టైమ్’ జాబితాలో మోదీ, మమత, పూనావాలా

తాలిబన్ సహ వ్యవస్థాపకుడు బరాదర్కూ చోటు
న్యూయార్క్, సెప్టెంబర్ 15: టైమ్ మ్యాగజైన్ రూపొందించిన ‘ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తుల జాబితా-2021’లో ప్రధాని మోదీ, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, సీరమ్ ఇన్స్టిట్యూట్ సీఈవో అదర్ పూనావాలకు స్థానం లభించింది. ‘టైమ్’ బుధవారం విడుదలచేసిన ఈ జాబితాలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, ప్రిన్స్ హ్యారీ-మేఘన్, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్, తాలిబన్ సహ వ్యవస్థాపకుడు ముల్లాహ్ అబ్దుల్ ఘనీ బరాదర్ తదితరులు కూడా ఉన్నారు. ‘74 ఏండ్ల స్వాతంత్య్ర భారతంలో ముగ్గురు శక్తిమంతమైన నాయకులు ఉన్నారు. వారు జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, మోదీ. నెహ్రూ, ఇందిర తర్వాత భారత రాజకీయాలను శాసిస్తున్నది మోదీయే’ అని ‘టైమ్’ పేర్కొంది. దేశాన్ని సెక్యులరిజం నుంచి హిందూ జాతీయవాదంవైపు మోదీ పురిగొల్పారని, దేశంలో ముస్లింల హక్కులను హరిస్తున్నారని, జర్నలిస్టులను భయపెడుతున్నారని, జైళ్లలో బంధిస్తున్నారని ఆరోపించింది. భారత రాజకీయాల్లో మమతా బెనర్జీని కాఠిన్యానికి మరో రూపంగా ‘టైమ్’ అభివర్ణించింది. ప్రపంచంలో అతిపెద్ద వ్యాక్సిన్ల తయారీ సంస్థకు పూనావాలా సారథ్యం వహిస్తున్నారని, కరోనాను అంతం చేయడంలో కీలక పాత్ర పోషించగలరని పేర్కొంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
KTR | కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం.. కేటీఆర్ ధ్వజం
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

