వాషింగ్టన్: అమెరికాలో మొబైల్సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఏటీ అండ్ టీ, క్రికెట్ వైర్లెస్, వెరిజోన్, టీ మొబైల్‌తోపాటు పలు ఇతర మొబైల్ నెట్‌వర్క్‌లలో కనెక్టివిటీ సమస్య తలెత్తినట్టు డౌన్‌డిటెక్టర్ అనే ఔటేజ్ ట్రాకింగ్ వెబ్సైట్ వెల్లడించింది.
ఈ మేరకు 50 వేలకు పైగా ఫిర్యా దు అందినట్టు పేర్కొన్నది. హ్యూస్టన్, అట్లాంటా, షికాగో వంటి ప్రాంతాల్లో సమస్యలు తలెత్తినట్టు వివరించింది. ఈ భారీ అంతరాయానికి గల కారణాలు ఇంకా వెల్లడికాలేదు.