Mike Pense | 2024 అధ్యక్ష ఎన్నికల్లో మైక్ పెన్సె పోటీ చేయనున్నారా?.. సలహాదారుడు ఏమన్నాడంటే..!
మైక్ పెన్సె అమెరికా 48వ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు
Mike Pense : రెండేళ్లలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. దాంతో, పోటీలో ఎవరెవరు ఉంటారని సర్వత్రా ఆసక్తి మొదలైంది. మాజీ వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్సె పోటీ చేస్తాడనే వార్తలు వినిపించాయి. అయితే.. వాటిని ఆయన సలహాదారుడు డెవిన్ ఒ మల్లే కొట్టిపారేశారు. మైక్ పెన్సె 2024 అమెరికా ప్రెసిడెంట్ ఎలక్షన్లో బరిలోకి దిగడం లేదని ఆయన స్పష్టం చేశారు. ఫెడరల్ ఎలక్షన్ కమిషన్లో మైక్ పెన్సె వివరాలు నమోదు చేశారనే వదంతలు వ్యాపించాయి. ఇదే వార్త కొన్ని మీడియా సంస్థల్లోనూ వచ్చింది. దాంతో, వాటిపై క్లారిటీ ఇచ్చేందుకు డెవిన్ స్పందించారు. అయితే.. మైక్ పెన్సె వివరాలను ఎవరు నమోదు చేశారనేది మాత్రం తెలియలేదు.
డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో మైక్ పెన్సె వైస్ ప్రెసిడెంట్ అయ్యారు. రిపబ్లిక్ పార్టీకి చెందిన ఆయన అమెరికా 48వ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 2017 నుంచి 2021 వరకు ఆ పదవిలో కొనసాగారు. 2020 ప్రెసిడెంట్ ఎలక్షన్లో ట్రంప్ ఓడిపోయాడు. కొత్త అధ్యక్షుడిగా జో బిడెన్ ఎన్నికయ్యాడు. అయితే.. ట్రంప్ ఆ ఎన్నికల ఫలితాల్ని సవాల్ చేసేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో ఆయనకు పెన్సె మద్దతు ఇవ్వలేదు. ఒకవేళ మైక్ పెన్సె 2024 ఎన్నికల్లో పోటీ చేసినా గెలిచే అవకాశాలు తక్కువ అని రియల్ క్లియర్ పాలిటిక్స్ అనే సర్వే సంస్థ తెలిపింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

