బైక్ చోరుల పనిబట్టే బ్యాట్‌మ్యాన్!
రాత్రి సమయంలో బ్యాట్ దుస్తులు వేసుకుని రహస్యంగా తిరుగుతూ తన తెలివి, శక్తితో హీరోయిజం ప్రదర్శించడం, నేరాలను అడ్డుకోవడం, దొంగలు, నేరగాళ్లను నిరోధించడం మనం బ్యాట్‌మ్యాన్ సినిమాలో చూశాం. కానీ, మెక్సికో దేశంలో అచ్చంగా ఇలాంటి లక్షణాలే ఉన్న ఒక వ్యక్తి తన చర్యలతో పౌరులను ఆశ్చర్యపరుస్తున్నాడు.
మెక్సికో, జూన్ 28 : రాత్రి సమయంలో బ్యాట్ దుస్తులు వేసుకుని రహస్యంగా తిరుగుతూ తన తెలివి, శక్తితో హీరోయిజం ప్రదర్శించడం, నేరాలను అడ్డుకోవడం, దొంగలు, నేరగాళ్లను నిరోధించడం మనం బ్యాట్‌మ్యాన్ సినిమాలో చూశాం. కానీ, మెక్సికో దేశంలో అచ్చంగా ఇలాంటి లక్షణాలే ఉన్న ఒక వ్యక్తి తన చర్యలతో పౌరులను ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇతడు కూడా బ్యాట్‌మ్యాన్ తరహాలోనే కొందరు మోటారు సైకిళ్ల చోరులను రాత్రి సమయంలో పట్టుకుంటున్నాడు. జలిస్కో రాష్ట్రంలోని లాగోస్ డి మోరెనో మున్సిపాల్టీ పరిధిలో గత 10 రోజుల వ్యవధిలో ఐదుగురు బైక్ చోరులను పట్టుకున్నాడు. అంతేకాకుండా వారిని కరెంట్ స్తంభానికి టేప్‌తో కట్టేసి, కదలకుండా బంధిస్తున్నాడు.
వారు అపహరించిన మోటార్ బైక్‌ను వారి సమీపంలోనే వదిలి వెళ్తున్నాడు. దీంతో ఆ ఆపరిచిత వ్యక్తిని స్థానికులు ‘లాగోస్ డి మోరెనో బ్యాట్‌మ్యాన్’గా వ్యవహరిస్తున్నారు. కాగా, వీటికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.స్తంభానికి కట్టేసిన వ్యక్తులను ఆ ఆపరిచితుడు కొట్టిన గుర్తుగా కొందరు ఒంటిపై గాయాలు కూడా ఉన్నాయి. చోరీల నిరోధంలో రక్షణ వ్యవస్థ విఫలం కావడంతోనే ఆ వ్యక్తి విసిగి బైక్ చోరులను ఇలా లక్ష్యంగా చేసుకున్నాడని స్థానిక మీడియా పేర్కొన్నది. ఈ అపర బ్యాట్‌మ్యాన్‌ను స్వయంగా చూడాలని ఉందంటూ పలువురు పౌరులు సామాజిక మాధ్యమంలో ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ ఉదంతాలపై దర్యాప్తు చేస్తున్నామని, ప్రస్తుతమైతే బ్యాట్‌మ్యాన్‌గా పేర్కొన్న వ్యక్తి కట్టిపడేసిన వ్యక్తుల్ని నిందితులుగా కాకుండా బాధితులుగా చూస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

