Meta: 20 మంది ఉద్యోగుల్ని తొలగించిన మెటా సంస్థ..
Meta company : మెటా కంపెనీ 20 మంది ఉద్యోగుల్ని తొలగించింది. ఆ ఉద్యోగులు రహస్య సమాచారాన్ని లీక్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. త్వరలో మరికొంత మంది కూడా ఉద్యోగాలు కోల్పోయే అవకాశాలు ఉన్నట్లు కంపెనీ వర్గలు వెల్లడించాయి.
శాన్ ఫ్రాన్సిస్కో: సంస్థ సమాచారాన్ని లీక్ చేసిన 20 మంది ఉద్యోగుల్ని మెటా(Meta) కంపెనీ తొలగించింది. ఆ ఉద్యోగులు రహస్య సమాచారాన్ని లీక్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. వాళ్లు ఏ ఉద్దేశంతో సమాచారం లీక్ చేసినా.. తమ విధానాలకు విరుద్ధమని మెటా సంస్థ ప్రతినిధి పేర్కొన్నారు. ఇటీవల కంపెనీలో ఓ దర్యాప్తు చేపట్టామని, దాంట్లో 20 మంది ఉద్యోగులు దోషులుగా తేలారని, వాళ్లు కంపెనీ రహస్య సమాచారాన్ని బయటకు చేరవేస్తున్నట్లు తెలిసిందని ఆ ప్రతినిధి చెప్పారు. త్వరలో మరికొంత మంది కూడా ఉద్యోగాలు కోల్పోయే అవకాశాలు ఉన్నట్లు వెల్లడించారు.
సంస్థ సమాచారాన్ని లీక్ చేసే అంశాన్ని సీరియస్‌గా తీసుకుంటామని, లీక్‌లు జరుగుతున్నట్లు గుర్తించినప్పుడల్లా ఇలాంటి చర్యలు ఉంటాయని అన్నారు. ఇటీవల ఉద్యోగులతో జుకర్‌బర్గ్ నిర్వహించిన వరుస మీటింగ్‌ల తర్వాత ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ప్రస్తుతం అమెరికాలోని ట్రంప్ సర్కారుకు అనుకూలంగా మెటా కంపెనీ తన ప్రణాళికల్ని రచిస్తున్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ | ఇక వన్డే సవాల్.. రోకోపైనే అందరి చూపు
Water Shortage | కాలేజీల్లో నీటి కొరత.. క్లాసులు బంద్.. విద్యార్థులను ఇంటికి పంపిన నారాయణ, శ్రీచైతన్య విద్యాసంస్థలు
SSC Exam Fee | విద్యాశాఖ డొల్లతనం.. టెన్త్ పరీక్ష ఫీజుల ఆన్లైన్ చెల్లింపుల్లో సర్వర్ సమస్య
Bureaucrats | డోంట్‌కేర్ సర్కార్.. ప్రభుత్వం పనైపోయింది, మళ్లీ వచ్చేది లేదు! నిర్ధారణకు వచ్చిన బ్యూరోక్రాట్లు
BC Atma Gaurava Bhavans | బీసీల ‘ఆత్మగౌరవం’పై కాంగ్రెస్ సర్కార్ పెత్తనం.. వేల కోట్ల విలువైన ఆస్తుల హస్తగతానికి గుట్టుగా జీవో!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

