శనివారం 04 ఏప్రిల్ 2020
International - Feb 26, 2020 , 16:20:41

కరోనా నుంచి కోలుకుంటున్నారని డ్యాన్స్‌..వీడియో

కరోనా నుంచి కోలుకుంటున్నారని డ్యాన్స్‌..వీడియో

చైనా వాసులు కరోనావైరస్‌ (కోవిడ్-19) ధాటికి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్న విషయం తెలిసిందే. చైనాలో కరోనా మృతుల సంఖ్య 2700 దాటింది. తాజా పరిణామాల నేపథ్యంలో ఇద్దరు వైద్య సిబ్బంది కరోనా వ్యాధిగ్రస్తుల్లో మనోధైర్యాన్ని నింపారు. చైనాలోని ఓ ఆస్పత్రిలో చేరిన కరోనా వ్యాధిగ్రస్తులు మెల్లమెల్లగా కోలుకుంటున్నారు. చికిత్స కోసం అన్హుయి  మెడికల్‌ కాలేజీలో చేరిన వారిలో ఆరుగురి ఆరోగ్యం కుదుటపడుతోంది. కరోనా నుంచి కోలుకుంటుండటంతో సంతోషం వ్యక్తం చేస్తూ..ఇద్దరు స్టాఫ్‌ మెంబర్లు ఆస్పత్రి నుంచి కిందకు దిగుతూ లిఫ్ట్‌ దగ్గర సంతోషంతో డ్యాన్స్‌  చేశారు. మాస్కులో ఉన్న ఇద్దరు డ్యాన్స్‌ చేసిన వీడియో ఇపుడు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది.  
logo