ఇప్పటికిప్పుడు భారతీయులను తరలించే ఉద్దేశం లేదు : భారత విదేశాంగ శాఖ
ఉక్రెయిన్‌లోని భారతీయులను స్వదేశానికి చేర్చే విషయంపై కేంద్ర విదేశాంగ శాఖ గురువారం కీలక ప్రకటన చేసింది. ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయులను ఇప్పటికిప్పుడు, హడావుడిగా భారత దేశానికి తీసుకొచ్చే ఆలోచనలేవీ లేవని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ పేర్కొన్నారు. అయితే ఉక్రెయిన్‌లో జరుగుతున్న వ్యవహారాలను మాత్రం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే వున్నామని, భయపడాల్సిన అవసరం లేదని భరోసా కల్పించారు.
‘ఉక్రెయిన్‌లో ఉండే భారతీయులను ఇప్పటికిప్పుడు భారత్‌కు తరలించే ఆలోచనలు లేవు. దీంతో ప్రత్యేక విమానాలకు ఎలాగూ ఆస్కారముండదు. కరోనా కారణంగా విదేశాలకు అంతర్జాతీయ విమానాలు నడిపే విషయంలో కొన్ని ఒప్పందాలు జరిగాయి. వీటి ప్రకారం కొన్ని ఆంక్షలు, పరిమితులు అమలులో ఉన్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా… విమానాల సంఖ్య, ప్రయాణికుల సంఖ్యపై ఉన్న ఆంక్షలను ఎత్తేశాం. వీరిని తీసుకురావడానికి ఇండియా- ఉక్రెయిన్ మధ్య ఛార్టెడ్ ఫ్లైట్లను ప్రోత్సహిస్తున్నాం’ అని అరిందం బాగ్చి వెల్లడించారు.
రష్యా- ఉక్రెయిన్ మధ్య తలెత్తిన పరిస్థితులపై భారత్ మరో సారి స్పందించింది. ఇరు దేశాల్లో పరిస్థితులు మామూలు స్థితికి చేరుకోవడానికి జరుగుతున్న ప్రయత్నాలను తాము స్వాగతిస్తున్నట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ పేర్కొన్నారు. చర్చల ద్వారా, దౌత్యం ద్వారా సమస్య పరిష్కారం కావాలన్నదే తమ అభిమతమని అరిందం బాగ్చీ స్పష్టం చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Allu Arjun | అల్లు అర్జున్ ఒక్క పోస్ట్‌తో మళ్లీ మొదలైన మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్ వార్.. రజినీకాంత్‌పై ప్రశంసలే కారణమా?
Stock Market | నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 125 పాయింట్లు పతనం
Rukmini Vasanth | శ్రీకార్తిక్ దర్శకత్వంలో రుక్మిణి వసంత్ క్రేజీ రోడ్ ట్రిప్ చిత్రం.. ప్రోమో విడుదల!
‘గస్తీ నిర్వహణతో నేరాల నియంత్రణకు కృషి చేయాలి’
‘కొత్తగూడెం రైల్వే సమస్యలకు పరిష్కారం చూపండి’
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

