Greenland ice: డేంజర్ బెల్స్.. గ్రీన్లాండ్లో భారీగా కరుగుతున్న మంచు
ప్రపంచానికి మంచుతో భారీ ముప్పు తప్పేలా లేదు. తాజాగా గ్రీన్లాండ్లో మంచు చాలా వేగంగా, భారీగా కరిగిపోతోంది. ఇదొక్క వారంలో కరిగిన మంచే అమెరికా రాష్ట్రం ఫ్లోరిడాను 2 అంగుళాల నీటిలో ముంచేయగలదని డానిష్ ప్రభుత్వ పరిశోధకులు చెప్పారు.

వాషింగ్టన్: ప్రపంచానికి మంచుతో భారీ ముప్పు తప్పేలా లేదు. తాజాగా గ్రీన్లాండ్లో మంచు చాలా వేగంగా, భారీగా కరిగిపోతోంది. ఇదొక్క వారంలో కరిగిన మంచే అమెరికా రాష్ట్రం ఫ్లోరిడాను 2 అంగుళాల నీటిలో ముంచేయగలదని డానిష్ ప్రభుత్వ పరిశోధకులు చెప్పారు. వీళ్లు తమ పరిశోధన తాలూకు ఫలితాలను పోలార్ పోర్టల్ వెబ్సైట్లో పోస్ట్ చేశారు. గత బుధవారం ఒక్కరోజే గ్రీన్లాండ్లో భారీగా మంచు కరిగిపోయిందని వాళ్లు వెల్లడించారు. 1950 నుంచి ఇక్కడ మంచు కరిగిన ఘటనలను చూస్తే.. ఇది మూడో అతిపెద్దదని తెలిపారు. 2012, 2019లోనూ ఇలాగే భారీగా మంచు కరిగిందని, అయితే వీటిలో 2019లో ఇంతకంటే పెద్ద స్థాయిలో మంచు కరిగిపోయి సముద్రాల్లో కలిసిందని పరిశోధకులు చెప్పారు.
ఎంత మంచు కరిగింది?
తాజా పరిశోధన ప్రకారం గత బుధవారం ఒక్క రోజే 22 గిగా టన్నుల మంచు కరిగిపోయింది. ఇందులో 12 గిగా టన్నులు సముద్రంలో కలిసిపోయినట్లు పర్యావరణ శాస్త్రవేత్త జేవియర్ ఫెట్వీస్ చెప్పారు. అయితే అంతకుముందే భారీగా మంచు కురవడంతో మరో 10 గిగా టన్నుల మంచు మళ్లీ గట్టిపడిపోయిందని ఆయన తెలిపారు. ఒక గిగా టన్ను అంటే 100 కోట్ల మెట్రిక్ టన్నులు. వాతావరణంలో మార్పులే ఇంత భారీ స్థాయిలో మంచు కరగడానికి కారణమని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. ఆర్కిటిక్ ప్రాంతంలో ఉష్ణ గాలులు చుట్టుముట్టాయని, ఫలితంగానే మంచు ఇలా భారీ స్థాయిలో కరిగిపోయిందని చెప్పారు. ప్రస్తుతం గ్రీన్లాండ్లో సగటు వేసవి ఉష్ణోగ్రతల కంటే రెట్టింపు (20 డిగ్రీల సెల్సియస్) ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు డానిషన్ వాతావరణ సంస్థ వెల్లడించింది.
గ్రీన్లాండ్ మొత్తం కరిగిపోతే..?
వాతావరణంలో ఇలాగే మార్పులు చోటు చేసుకుంటూ, ఉష్ణ గాలుల తీవ్రత ఎక్కువవుతుంటే.. మంచు కరగడం మరింత వేగంగా జరుగుతుందని సైంటిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 1990 నుంచి ఇక్కడి మంచు వేగంగా కరుగుతున్నట్లు గుర్తించారు. 2000 వచ్చేసరికి ఈ వేగం మరింత పెరిగింది. ఇక ఈ మధ్య కాలంలో కరిగిన మంచు అయితే 2000 ఏడాది కంటే నాలుగు రెట్లు ఎక్కువ కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
ప్రపంచంలో అతిపెద్ద ఖండాంతర ద్వీపం గ్రీన్లాండ్. భూమిపై అంటార్కిటికా తర్వాత శాశ్వత మంచు పలక ఉన్నది ఇక్కడే. ప్రపంచంలోని మొత్తం స్వచ్ఛమైన నీటిలో 70 శాతం ఈ అంటార్కిటికా, గ్రీన్లాండ్లో ఉన్న మంచులోనే ఉంది. ఇక్కడి మంచు మొత్తం కరిగితే ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టాలు 6 నుంచి 7 మీటర్ల మేర పెరుగుతుందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Race Course Land: రేస్ కోర్స్ స్థలాన్ని ఐఏఎఫ్కే ఇవ్వండి.. రాజ్‌నాథ్‌కు లేఖ రాసిన ఏపీ సింగ్
‘పెన్షనర్లు జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికెట్‌ను తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాలి’
High BP | రక్తపోటు ఉన్నవారు మందులను మానేస్తే కలిగే దుష్పరిణామాలు ఇవే.. జాగ్రత్త పడాల్సిందే..
మురాసు తుఫాన్ ప్రభావం.. పెన్‌పహాడ్ వ్యాప్తంగా నేలవాలిన వరి చేలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

