ట్రంప్‌ను కిడ్నాప్ చేసి చంపేస్తా.. 72 ఏళ్ల వ్యక్తి అరెస్టు

న్యూయార్క్: అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను కిడ్నాప్ చేసి చంపేస్తానని బెదిరించిన 72 ఏళ్ల వ్యక్తిని న్యూయార్క్‌లో యూఎస్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అరెస్టు చేశారు. బ్రూక్లిన్ ఫెడరల్ కోర్టులో థామస్ వెల్నిక్ కేసులో సోమవారం వాదనలు జరిగాయి. కావాలనే అతను మాజీ అధ్యక్షుడిని బెదిరించినట్లు ప్రాసిక్యూటర్లు కోర్టు తెలిపారు. గత ఏడాది జనవరిలో జరిగిన క్యాపిటల్ హిల్ దాడి ఘటన కేసులో థామస్ వెల్నిక్ను ఇంటర్వ్యూ చేశారు. ఆ సమయంలో అతను ట్రంప్‌ను టార్గెట్ చేస్తూ మాట్లాడారు. ఒకవేళ ట్రంప్ ఓడినా ఆఫీసు నుంచి వెళ్లకుంటే, అప్పుడు ఆయుధాలు ఖరీదు చేసి అతన్ని చంపేస్తానంటూ క్యాపిటల్ హిల్ పోలీసులకు థామస్ తెలిపారు. ఇదే అంశంపై పలుమార్లు పోలీసులకు అతను మెసేజ్ కూడా చేశాడు. దీనిపై బ్రూక్లిన్ కోర్టులో విచారణ జరిగింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chinmay Sutar: చరిత్ర సృష్టించిన మిజోరం బ్యాటర్.. చిన్మయ సుతార్ 400 నాటౌట్
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Tiger Shroff | అసలు నన్నెందుకు టార్గెట్ చేశారో అర్థం కావట్లేదు : టైగర్ ష్రాఫ్
Mission bhageeratha | పర్యవేక్షణ లోపమా..? ఇష్టారాజ్యమా..? వృథాగా మిషన్ భగీరథ నీరు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెం జడ్పీహెచ్ఎస్ పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

