నడి రోడ్డుపై ల్యాండ్‌మైన్ (బాంబు) కనిపిస్తే ఏం చేస్తాం? బతుకు జీవుడా అనుకుంటూ దానికి దూరంగా పరిగెడతాం. అయితే ఉక్రెయిన్‌లోని బెర్డయాన్స్క్ నగరంలో ఉక్రెయిన్ యుద్ధ ట్యాంకులను పేల్చాలన్న ఉద్దేశంతో రష్యా సేనలు నడిరోడ్డుపై ఓ ల్యాండ్‌మైన్‌ను ఉంచాయి. దీన్ని గమనించిన ఉక్రెయిన్ పౌరుడు.. తమ జవాన్లకు ఏమీ కాకూడదని ఒట్టి చేతులతోనే ల్యాండ్‌మైన్‌ను పట్టుకుని దూరంగా విసిరి పారేశాడు.