French Man | ప్రతి రాత్రి భార్యకు మత్తు ఇచ్చి.. పదేళ్లుగా పర పురుషులతో అత్యాచారం, వీడియో రికార్డ్ చేసిన భర్త
French Man | ఒక వ్యక్తి (French Man) తన భార్యకు మత్తుమందు ఇచ్చి ప్రతి రాత్రి మత్తులో ఉంచేవాడు. పర పురుషులను ఇంటికి రప్పించి వారితో అత్యాచారం చేయించేవాడు. ఆపై ఆ చర్యను వీడియో రికార్డ్ చేసేవాడు. సుమారు పదేళ్ల తర్వాత ఈ వ్యవహారం బయటపడింది. ఈ విషయం తెలియడంతో భార్య షాక్ అయ్యింది.
పారిస్: ఒక వ్యక్తి (French Man) తన భార్యకు మత్తుమందు ఇచ్చి ప్రతి రాత్రి మత్తులో ఉంచేవాడు. పర పురుషులను ఇంటికి రప్పించి వారితో అత్యాచారం చేయించేవాడు. ఆపై ఆ చర్యను వీడియో రికార్డ్ చేసేవాడు. సుమారు పదేళ్ల తర్వాత ఈ వ్యవహారం బయటపడింది. ఈ విషయం తెలియడంతో భార్య షాక్ అయ్యింది. భర్తకు విడాకులు ఇచ్చేందుకు చర్యలు చేపట్టింది. ఈ షాకింగ్ సంఘటన ఫ్రాన్స్‌లో జరిగింది. ది టెలిగ్రాఫ్ కథనం ప్రకారం.. డొమినిక్ పీ అనే వ్యక్తికి 50 ఏళ్ల కిందట ఒక మహిళతో వివాహమైంది. వారికి ముగ్గురు పిల్లలు.
కాగా, 2011లో డ్రగ్స్ మత్తులో ఉన్న జీవిత భాగస్వాములతో అపరిచయ వ్యక్తుల శృంగారానికి సంబంధించిన వైబ్‌సైట్ ద్వారా కొందరు వ్యక్తులను డొమినిక్ సంప్రదించాడు. రాత్రి వేళ భార్య భోజనంలో మత్తు మందు కలిపి ఆమెను మత్తులో ఉంచేవాడు. పర వ్యక్తులను తన ఇంటికి రప్పించేవాడు. మత్తులో ఉన్న భార్యపై వారితో అత్యాచారం చేయించేవాడు. ఈ చర్యను వీడియోలో రికార్డు చేసేశాడు.
మరోవైపు, భార్యకు ఎలాంటి అనుమానం రాకుండా డొమినిక్ పలు జాగ్రత్తలు కూడా తీసుకున్నాడు. ఘటు వాసనలు నివారించేందుకు పొగతాగడం, పెర్ఫ్యూమ్స్ వాడటం నిషేధించాడు. పర పురుషులు తమ దుస్తులు బాత్రూమ్లో వదిలేయకుండా కిచెన్లోనే వాటిని విప్పాలని చెప్పేవాడు. అలాగే ఇరుగు పొరుగువారికి అనుమానం రాకుండా వాహనాలను సమీపంలోని స్కూల్ వద్ద పార్క్ చేయించేవాడు. ఎవరూ చూడకుండా చీకటిలో నడిచి తన ఇంటికి రమ్మని వారికి చెప్పేవాడు. 2011 నుంచి 2020 వరకు సుమారు పదేళ్లపాటు సుమారు వంద మంది పర పరుషులతో భార్యపై పలుమార్లు అత్యాచారం చేయించాడు.
కాగా, 2020లో డొమినిక్ గుట్టురట్టయ్యింది. దుస్తులు మార్చుకునే గదుల్లో మహిళలను చిత్రీకరించేందుకు అతడు రహస్య కెమెరా ఉపయోగిస్తున్నట్లు పోలీసులు అనుమానించారు. దీనిపై దర్యాప్తు చేయగా భార్యపై పర వ్యక్తులతో అత్యాచారం చేయించిన వీడియో రికార్డింగులు బయటపడ్డాయి. పదేళ్లలో సుమారు 92 మంది వ్యక్తులు ఆ మహిళపై పలుమార్లు లైంగిక దాడులకు పాల్పినట్లు పోలీసులు తెలుసుకున్నారు. వీరిలో 26 నుంచి 73 ఏళ్ల మధ్య వయస్సున్న 51 మందిని గుర్తించారు. లైంగిక దాడి కేసులు నమోదు చేసి వారిని అరెస్ట్ చేశారు. ఫైర్‌మెన్, లారీ డ్రైవర్, మున్సిపల్ కౌన్సిలర్, బ్యాంకులో ఐటీ ఉద్యోగి, జైలు గార్డు, నర్సు, జర్నలిస్ట్ వంటి వారు నిందితుల్లో ఉన్నట్లు తెలిపారు. పలువురు వ్యక్తులు పలుసార్లు లైంగిక దాడి చర్యలో పాల్గొన్నట్లు పోలీసులు చెప్పారు. మిగతా నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.
మరోవైపు ఇతర వ్యక్తులతో తనపై అత్యాచారాలు, ఆ చర్యలను భర్త వీడియో రికార్డ్ చేయడం గురించి పోలీసుల ద్వారా తెలుసుకున్న బాధిత మహిళ షాక్ అయ్యింది. పెద్దగా ఏడ్వడంతోపాటు డిప్రెషన్‌కు గురైంది. అలాగే విడాకుల కోసం దరఖాస్తు చేసింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parliament: ప్రోరోగ్ కాకుండా 88 రోజులుగా వర్షాకాల సమావేశాలు.. పార్లమెంట్లో కొత్త రికార్డు
OTT Movies | ఓటీటీలో ఈ వారం 14 కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు.. రణబాలి నుంచి జైలర్ 2 వరకు..!
TV Anchor: పాకిస్థాన్‌లో టీవీ యాంకర్ కాల్చివేత.. భర్త అరెస్టు
Bodybuilder Venkatesan: హైదరాబాదీ బాడీబిల్డర్ వెంకటేశన్‌కు మిస్టర్ నేచురల్ వరల్డ్ టైటిల్
Ranabaali | నెట్‌ఫ్లిక్స్‌లోకి విజయ్ దేవరకొండ, రష్మిక ‘రణబాలి’.. ఐదు భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్, రిలీజ్ డేట్ ఫిక్స్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

