ఒకే కాన్పులో 9 మందికి జన్మనిచ్చిన 25 ఏండ్ల మహిళ
ఒకే కాన్పులో 9 మంది | ఈ 25 ఏండ్ల మహిళ మాత్రం ఏకంగా ఒకే కాన్పులో 9 మందికి జన్మనివ్వడంతో అందరూ షాక్ అయ్యారు.

కొంత మంది మహిళలు ఒకే కాన్పులో కవల పిల్లలకు జన్మనివ్వడం చూశాం. ఇంకొంత మంది మహిళలు ఒకే కాన్పులో ముగ్గురు, నలుగురు పిల్లలకు జన్మనివ్వడం చూశాం. కానీ ఈ 25 ఏండ్ల మహిళ మాత్రం ఏకంగా ఒకే కాన్పులో 9 మందికి జన్మనివ్వడంతో అందరూ షాక్ అయ్యారు.
పశ్చిమాఫ్రికాలోని మాలీ దేశానికి చెందిన హలీమా సిస్సే(25) 9 నెలల క్రితం గర్భం దాల్చింది. ఈ క్రమంలో నెలలు నిండుతున్న కొద్ది ఆమెకు వైద్యులు స్కానింగ్ చేశారు. ఈ పరీక్షల్లో ఆమె కడుపులో ఏడుగురు పిల్లలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో మెరుగైన వైద్యం కోసం ఆమెను మార్చి నెలలో మాలీలోని మోరాకోకు తరలించారు. ఆ గర్భిణి మంగళవారం డెలివరీ అయింది. డాక్టర్లు ఏడుగురు పిల్లలే జన్మిస్తారు అనుకున్నారు. కానీ అదనంగా మరో ఇద్దరు పిల్లలు పుట్టేసరికి వైద్యులు షాక్ అయ్యారు. వీరిలో ఐదుగురు ఆడపిల్లలు, నలుగురు అబ్బాయిలు ఉన్నారు. తల్లి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, పిల్లలో కొందరు బలహీనంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. హలీమాకు సీజేరియన్ నిర్వహించినట్లు వారు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి..
శ్రీకాకుళంలో విషాదం.. తండ్రికి కరోనా.. నీళ్లు ఇచ్చేందుకు వెళ్లిన బిడ్డను ఆపిన తల్లి
దేశంలో కరోనా పరిస్థితిపై ఆర్బీఐ కీలక వ్యాఖ్యలు..!
మరాఠా రిజర్వేషన్లు రద్దు చేసిన సుప్రీం కోర్టు
హ్యాట్రిక్.. బెంగాల్ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ ప్రమాణ స్వీకారం
కరోనా విలయం.. 24 గంటల్లో 3.82లక్షల కేసులు.. 3,780 మంది మృతి
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Venkatesh | 30న వస్తున్న ‘ఆదర్శ కుటుంబం’
Delhi Airport | ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో పంజాబ్ సీఎం నిలిపివేత.. ఇది కేంద్రం వేధింపులేనని ఆప్ ఆరోపణ
Credit Cards | క్రెడిట్ కార్డు చెల్లింపులు ఆలస్యమైనా చార్జీల్లేవ్.. యూజర్లకు ఆర్బీఐ ఊరట
Parakala Prabhakar | ‘సర్’ వ్యతిరేక నిరసనలో పరకాల ప్రభాకర్
Rajiv Yuva Vikasam | కొందరికే యువవికాసం.. యువతకు మరోసారి కాంగ్రెస్ దగా!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

