Earthquake : జపాన్ (Japan) లో మరోసారి భూకంపం (Earthquake) సంభవించింది. ఆదివారం ఉదయం జపాన్‌లో మరోసారి భూమి కంపించింది. ఆ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.1గా నమోదైంది. అమోరి ప్రిఫెక్చర్ సమీపంలో 40 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు జపాన్ వాతావరణ విభాగం (JMA) వెల్లడించింది. కాగా గత కొన్ని రోజులుగా పలు దేశాలను భూకంపాలు వణికిస్తున్నాయి. ఈ ప్రకృతి విపత్తు ఇటీవల వెనెజువెలా (Venezuela) లో భారీ విధ్వంసాన్ని సృష్టించి విషాదాన్ని మిగిల్చింది.
వెనిజువెలాలో భూకంపం సంభవించిన సమయంలోనే జపాన్‌లో 7.2 తీవ్రతతో భూకంపం వచ్చింది. మళ్లీ కొద్ది రోజుల వ్యవధిలో ఇలా రెండోసారి ప్రకంపనలు రావడంపై జపాన్‌లో ఆందోళన వ్యక్తమవుతోంది. రానున్న రోజుల్లో మరిన్ని ప్రకంపనలు రావొచ్చని జపాన్ వాతావరణ విభాగం హెచ్చరించింది. కాగా ప్రస్తుతం ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీకాలేదు.