EVA Air flight | లండన్ వెళ్లే విమానంలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
EVA Air flight | తైవాన్‌కు చెందిన ఇవా ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ (EVA Air flight)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. విమానం గాల్లో ఉండగా ఓ ప్రయాణికుడు బాత్రూమ్లో ఆత్మహత్యకు ప్రయత్నించాడు (suicide attempt).
EVA Air flight | తైవాన్‌కు చెందిన ఇవా ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ (EVA Air flight)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. విమానం గాల్లో ఉండగా ఓ ప్రయాణికుడు బాత్రూమ్లో ఆత్మహత్యకు ప్రయత్నించాడు (suicide attempt). దీంతో ఆ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది.
మీడియా కథనాల ప్రకారం.. ఇవా ఎయిర్‌లైన్స్‌కు చెందిన బీఆర్ 67 ఫ్లైట్ గత శుక్రవారం బ్యాంకాక్ నుంచి లండన్ ( Bangkok to London) బయల్దేరింది. అయితే విమానంలోని ప్రయాణికుల్లో ఒకరు బాత్రూమ్కి వెళ్లి ఎంతసేపటికీ బయటకు రాలేదు. గుర్తించిన సిబ్బంది (Cabin crew ) రెస్ట్ రూమ్ వద్దకు వెళ్లి చూడగా.. ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడే స్థితిలో కనిపించాడు. దీంతో వెంటనే ఆ వ్యక్తిని బయటకు తీసుకొచ్చారు. అతడి మానసిక పరిస్థితిని గుర్తించి లండన్ వెళ్లాల్సిన విమానాన్ని దారి మళ్లించి హిత్రూ ఎయిర్‌పోర్ట్‌లో (Heathrow Airport) అత్యవసరంగా ల్యాండ్ చేసినట్లు ఎయిర్‌లైన్స్ తెలిపింది.
స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 7:30 గంటల సమయంలో విమానం ఎమర్జెన్సీ ల్యాండ్ అయినట్లు తెలిపింది. ఫ్లైట్ ల్యాండింగ్ కంటే ముందే వైద్య సిబ్బంది అక్కడ సిద్ధంగా ఉన్నారని, ప్రయాణికుడిని వెంటనే ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొంది. కాగా ప్రయాణికుడికి సంబంధించిన వివరాలు, ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు మాత్రం ఎయిర్‌లైన్స్ వెల్లడించలేదు.
Also Read..
Polluted Capital City : అత్యంత కలుషిత రాజధానిగా ఢిల్లీ .. కొత్త రిపోర్టు రిలీజ్
Indian Student: అమెరికాలో విద్యార్థి మృతి.. గుంటూరులో ముగిసిన అంత్యక్రియలు
Encounter | గడ్చిరోలిలో ఎన్కౌంటర్.. నలుగురు మావోయిస్టు అగ్రనేతలు మృతి
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

