వాషింగ్టన్: వయసులో తనకంటే చాలా పెద్దదైన మహిళతో తన వర్జినిటీని పోగొట్టకున్నానని ప్రిన్స్ హ్యారీ తెలిపాడు. ఈ నెల 10న ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లో విడుదలైన తన ఆత్మకథ ‘స్పేర్’లో హ్యారీ ఈ విషయాన్ని వెల్లడించాడు. ఒక బిజీ పబ్ వెనుక ఉన్న గడ్డి మైదానంలో వయసులో తన కంటే పెద్దావిడ తన వర్జినిటీని దోచుకుందని ఆయన పేర్కొన్నాడు. గుర్రాలను అమితంగా ఇష్టపడే ఆ మహిళ తనను ఓ కోడె గుర్రంలా ట్రీట్ చేసిందని హ్యారీ గుర్తుచేసుకున్నాడు.
ఆ బహిరంగ ప్రదేశంలో మా ఈ కలయిక 2001లో జరిగిందని, అప్పుడు నా వయసు కేవలం 17 సంవత్సరాలేనని హ్యారీ తెలిపాడు. అయితే, అప్పుడు తన వర్జినిటీని దోచుకున్న మహిళనుగానీ, ఆమె పేరునుగానీ తాను గుర్తించలేకపోయానని పేర్కొన్నాడు. కానీ, కొన్ని సంవత్సరాలపాటు తనకంటే 19 ఏండ్లు పెద్దది అయిన ఎలిజబెత్ హర్లీకి.. ప్రిన్స్ హ్యారీ తన వర్జినిటీని కోల్పోయినట్టు ఊహాగానాలు వెల్లువెత్తాయని, చివరికి ఆ ఊహాగానాలను హర్లీ గట్టిగా ఖండించిందని అమెరికన్ న్యూస్ అవుట్లెట్ ఫాక్స్ న్యూస్ ప్రచురించింది.
అయితే, హాలీవుడ్ నటి క్యాథరీన్ ఒమ్మాన్నే మాత్రం తనకు 21 ఏండ్ల వయసప్పుడు నవంబర్ నెలలో ఆ నెలంతా హ్యారీతో గడిపినట్టు తెలిపింది. కాగా, ఫాక్స్ న్యూస్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రిన్స్ హ్యారీ వర్జినిటీ అంశంతోపాటు ఇతర జ్ఞాపకాలను తన ఆత్మకత ‘స్పేర్’లో నెమరు వేసుకున్నాడు. 17 ఏండ్ల వయసులో ఒక ప్రత్యేకమైన అనుభవం కోసం తాను కొకైన్ కూడా తీసుకునేవాడినని తెలిపాడు. గంజాయి, మ్యాజిక్ మష్రూమ్స్ లాంటి మత్తుపదార్థాలను తీసుకున్నప్పుడు లేనిది ఉన్నట్టుగా కనిపించేదని, అప్పుడు టాయిలెట్స్ కూడా తనతో మాట్లాడేవని హ్యారీ తన బుక్లో చెప్పుకొచ్చాడు.