Donald Trump | సౌదీ యువరాజుపై ట్రంప్ అసభ్యకర వ్యాఖ్య.. ఆ వెంటనే పొగడ్తలు
Donald Trump | అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తన నోటి దురుసుకు మరింత పదనుపెట్టారు. సౌదీ యువరాజు గురించి అహంతో అసభ్యకర వ్యాఖ్య చేశారు. ఆ వెంటనే సరిచేసుకుని ఆయనపై పొగడ్తలు కురిపించారు. ఇరాన్ (Iran) తో యుద్ధం నేపథ్యంలో సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ (Mohmd Bin Salman) తనను ప్రసన్నం చేసుకుంటున్నారని అసభ్యకరంగా (kissing my ass) వ్యాఖ్యానించారు.
Donald Trump : అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తన నోటి దురుసుకు మరింత పదనుపెట్టారు. సౌదీ యువరాజు గురించి అహంతో అసభ్యకర వ్యాఖ్య చేశారు. ఆ వెంటనే సరిచేసుకుని ఆయనపై పొగడ్తలు కురిపించారు. ఇరాన్ (Iran) తో యుద్ధం నేపథ్యంలో సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ (Mohmd Bin Salman) తనను ప్రసన్నం చేసుకుంటున్నారని అసభ్యకరంగా (kissing my ass) వ్యాఖ్యానించారు. ఫ్లోరిడాలో జరిగిన ఓ పెట్టుబడిదారుల సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ వెంటనే పొరపాటును గ్రహించి పొగడ్తల్లో ముంచెత్తారు.
ముందుగా ట్రంప్ మాట్లాడుతూ.. నా అధ్యక్షతన అమెరికా ఇంత బలంగా ఎదుగుతుందని సౌదీ యువరాజు ఊహించలేదని అన్నారు. ‘ఏడాది క్రితం మీది చచ్చిన దేశం, ఇప్పుడు ప్రపంచంలోనే హాటెస్ట్ కంట్రీ’ అని సౌదీ యువరాజు పొగిడినట్లు చెప్పారు. ‘నేను మరో ఓడిపోయిన అమెరికా అధ్యక్షుడిలా ఉంటానని ఆయన అనుకున్నారు. కానీ ఇప్పుడు నాకు మర్యాద ఇవ్వాల్సి వస్తోంది’ అని ఎద్దేవా చేశారు. అయితే వెంటనే స్వరం మార్చిన ట్రంప్.. సౌదీ యువరాజును అద్భుతమైన వ్యక్తి, యోధుడు అని కొనియాడారు.
ఇరాన్‌పై యుద్ధంలో అమెరికాకు సౌదీ అరేబియాతోపాటు ఇతర గల్ఫ్ దేశాలు మద్దతుగా నిలిచాయని ప్రశంసించారు. సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈ, బహ్రెయిన్, కువైట్ మనతో కలిసి పోరాడాయని గుర్తుచేశారు. అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం ప్రారంభమై నెల రోజులు పూర్తయిన నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇరాన్‌తో భవిష్యత్తులో కుదుర్చుకునే ఏ ఒప్పందమైనా ఆ దేశ క్షిపణి, డ్రోన్ సామర్థ్యాలను శాశ్వతంగా నిరోధించాలని గల్ఫ్ దేశాలు అమెరికాపై ఒత్తిడి తెస్తున్నాయి.
ఇంధన సరఫరాలను ఇరాన్ మళ్లీ ఆయుధంగా వాడకుండా చూడాలని గల్ఫ్ దేశాలు కోరుతున్నాయి. కాగా ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఈ యుద్ధం డజనుకు పైగా దేశాల్లో ప్రభావం చూపుతోంది. ఈ ఘర్షణల్లో ఇప్పటివరకు ఇరాన్లో 1,900 మందితో సహా మొత్తం 4,500 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని ‘ది ఇండిపెండెంట్’ నివేదించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
MLC Dasoju Shravan Kumar | ఈ ప్రభుత్వానికి ఎంప్లాయింట్ పాలసీనే లేదు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

